చట్టాలపై అవగాహన పెంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

Oct 6 2026 1:06 AM | Updated on Oct 6 2026 1:06 AM

● సీనియర్‌ సివిల్‌ జడ్జి స్వాతిమురారి

మహబూబాబాద్‌ అర్బన్‌: విద్యార్థులు చదువుతోపాటు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి స్వాతి మురారి అన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌ పీఎంశ్రీ బాలికల పాఠశాలలో సోమవారం విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత తమ మేధస్సును ఉపయోగించుకొని కష్టపడి చదవాలన్నారు. సోషల్‌ మీడియాలో సమయాన్ని వృథా చేసే బదులు విజ్ఞానాన్ని పెంపొందించే ఛానళ్లు చూడాలన్నారు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ టోల్‌ ఫ్రీ నంబర్‌ 15100ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం ఆరుద్ర వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement