కురవి: బాలల అక్రమ రవాణాను నిర్మూలించాలని జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్ పర్సన్ నాగవాణి అన్నారు. మండల కేంద్రంలో సోమవారం వారాంతపు సంతలో ఎఫ్‌ఎంఎం సాంఘిక సేవా సంస్థ వరంగల్, మహబూబాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ యూనిట్, షీటీం పోలీసుల ఆధ్వర్యంలో బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా నిర్మూలనపై కళాకారులు కళా ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో మహిళలు, పిల్లలపై ఎక్కువగా హింస నమోదు అవుతుందని, తల్లిదండ్రులకు అవగాహన లేక బాల్య వివాహాలు జరుపుతున్నారని తెలిపారు. బాల్య వివాహాలు నేరమని, 18 ఏళ్లు నిండిన అమ్మాయిలకు, 21 ఏళ్లు నిండిన అబ్బాయిలకు పెళ్లిళ్లు చేయాలని సూచించారు. పిల్లలను వేధింపులకు గురిచేస్తే 1098కు సమాచారం ఇవ్వాలని, బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎఫ్‌ఎంఎం సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ సిస్టర్ సహాయ, సంస్థ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ ఎర్ర శ్రీకాంత్, ఫీల్డ్ కో–ఆర్డినేటర్స్ సీహెచ్.సమర, ఎన్.శిరీష, షీటీం సిబ్బంది పార్వతి, ప్రియాంక, అరుణ, ఏహెచ్‌టీయూ సిబ్బంది సుప్రజ, రమేశ్ పాల్గొన్నారు.
జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్‌పర్సన్ నాగవాణి


