ఐదేళ్ల తర్వాత పునఃప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఐదేళ్ల తర్వాత పునఃప్రారంభం

Jun 16 2026 1:16 AM | Updated on Jun 16 2026 1:16 AM

– మరిన్ని వివరాల 8లోu

పెద్దవంగర: మండలంలోని మోత్యాతండా గ్రామ పంచాయతీ పరిధి సో మ్లాతండా ప్రాథమిక పాఠశాల ఐదేళ్లుగా నిశ్శబ్దంగా ఉంది. అ యితే సోమవారం బ డి తెరుచుకొని పిల్లలతో కళకళలాడింది సర్పంచ్‌ గుగులోత్‌ కవిత యాకన్న చొరవతో స్కూల్‌ తెరుచుకుంది. తండా వాసులు జీవనోపాధి కోసం వలస వెళ్లడంతో గతంలో పాఠశాల మూతపడింది. ఈ పరిస్థితిని మార్చాలని సంకల్పించిన సర్పంచ్‌ వేసవి సెలవుల్లో విద్యార్థులకు ప్రత్యేక ట్యూషన్లు నిర్వహించారు. దీంతో పిల్లల్లో ఆసక్తి పెంచడమే కాకుండా వారి భవిష్యత్‌పై తల్లిదండ్రులకు పూర్తి భరోసా కల్పించారు. ఈ ప్రయత్నం సఫలీకృతం కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపేందుకు ముందుకొచ్చారు. స్థానిక విద్యార్థులతో పాటు సమీప భగ్యతండా, అమర్‌ సింగ్‌ తండా నుంచి కూడా పాఠశాలలో చేరారు. మొత్తంగా 15 మంది విద్యార్థులు చేరగా.. ఎంఈఓ బుదారపు శ్రీనివాస్‌ ముఖ్య అతిథిగా హాజరై పాఠశాలను ప్రారంభించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement