గ్రంథాలయం.. విజ్ఞానభాండాగారం | - | Sakshi
Sakshi News home page

గ్రంథాలయం.. విజ్ఞానభాండాగారం

May 19 2026 1:52 AM | Updated on May 19 2026 1:52 AM

నర్మెట ప్రభుత్వ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థిని శ్రీనిత్య గీసిన చిత్రంలో పాఠశాల ప్రత్యక్షమైన జ్ఞానదీపం, సరస్వతి అమ్మవారి రూపం, విద్య పవిత్రతను సూచిస్తోంది. హంస, పద్మం నిర్మలత, పవిత్రతకు సంకేతాలు. పుస్తకం, వీణ విద్య, కళ, సాంస్కృతిక విలువలు తెలియజేస్తున్నాయి. ప్రకృతి, చెట్లు, మేఘాలు సృజనాత్మకతతో పాటు జీవన సమతుల్యాన్ని చూపుతున్నాయి. మొత్తంగా ఈ చిత్రం విద్య, సంప్రదాయం, ప్రకృతి, సుస్వరం అన్నీ కలిసి అందమైన భావవ్యక్తీకరణగా కనిపిస్తోంది.

–జనగామ

మండల కేంద్రంలో అందరికీ అందుబాటులో లైబ్రరీ

మండల కేంద్రంలో శాఖా గ్రంథాలయం అందరికీ అందుబాటులో ఉంది. అందులో పోటీ పరీక్షలకే కాకుండా శాస్త్ర సాంకేతిక, రాజకీయ, సాంస్కృతిక, సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలతోపాటు చిన్నారులకు ప్రత్యేక కథల పుస్తకాలు మొత్తం కలిసి సుమారు పదివేల వరకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా చిన్నారులకు గ్రామీణ ఆటలు, నీతి కథలు, బాలల బొమ్మలతో అనంతవిశ్వం, మహానుభావుల జీవిత చరిత్ర వంటి తక్కువ పేజీలతో ఆకర్షణీయంగా అందుబాటులో ఉన్నాయి. ఉదయం 8 నుంచి 11: 30 వరకు, సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు చదువుకునే చిన్నారులకు గ్రంథాలయం తెరిచి ఉంటుంది. అంతేకాకుండా రూ.100 సభ్యత్వం తీసుకుని 15 రోజులు ఏదైనా పుస్తకం ఇంటికి తీసుకెళ్లి చదువుకుని తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా జిల్లాలోని అన్ని మండలాల్లో శాఖ గ్రంథాలయాలు అందుబాటులో ఉంటాయి.

–లింగాలఘణపురం

ప్రస్తుత రోజుల్లో చదువుతోపాటు వివిధ రంగాల్లో బాలికలే రాణిస్తున్నారు. ముఖ్యంగా బొమ్మలు గీయడంలో అద్భుత ప్రతిభ కనబర్చుతున్నారు. ఇందులో భాగంగా మండలంలోని హిమ్మత్‌నగర్‌ ప్రభుత్వ పాఠశాల 5వ తరగతి విద్యార్థి జల్లెల వర్షిణి వివిధ రకాల బొమ్మలు గీస్తూ ప్రశంసలు అందుకుంటోంది.

–జఫర్‌గఢ్‌

అతిగా ఆశపడితే

ఉన్నది ఊడ్చుకుపోతుంది

పేద తమ్ముడు ప్రతీ రోజు చేపలు పట్టి జీవనం సాగించేవాడు. ఒక రోజు అతడి వలలో బంగారు చేప చిక్కింది. వల నుంచి బయటకు తీయగానే ఆ చేప దేవతలాగే రూపం ధరించి, తనను నీటిలో వదిలినందుకు కృతజ్ఞతగా ‘తిరు గతి’ అనే వరాన్ని తమ్ముడికి ఇచ్చింది. ఆ తిరుగతి తిప్పుతూ ‘తిరుగవే తిరు గవే తిరుగతి, నా కోరిక తీరేదాకా తిరుగవే’ అని కోరితే ఆశించిన అన్నీ ప్రత్యక్ష మవుతాయని చేప తెలిపింది. తమ్ముడు ఆ వరాన్ని ఉపయోగించి తనకూ, తన కుటుంబానికి అవసరమైన అన్నీ సంపాదించాడు. కొద్ది కాలంలోనే అతను పేదవాడి నుంచి ధనవంతుడయ్యాడు. తమ్ముడు ధనవంతుడవడం చూసి పెద్ద అన్న లోభపడి, తన భార్య అనారోగ్యంగా ఉందని అబద్ధం చెప్పి తమ్ముడిని పిలిపించాడు. రాత్రికి తమ్ముడు నిద్రపోయిన తర్వాత అతని ఇంటికి దొంగచాటుగా వెళ్లి తిరుగతి చోరీ చేశాడు. చేపను దొంగిలించి పడవలో పరారవుతూ అతడు కూడా బంగారు చేప చెప్పిన మాటలతో ‘తిరుగవే తిరుగవే తిరుగతి, నాకు ఉప్పు కావాలి’ అని కోరాడు. వెంటనే చెరువంతా ఉప్పుతో నిండిపోవడంతో అతడు ఉన్న పడవ మునిగి పోయింది. లోభం మనిషిని నాశనం చేస్తుంది. ఇతరుల సంపాదించిన దానిపై కన్నేయకూడదు. ఉపకారానికి ఉపకారం చేయాలి, ద్రోహం కాదు. మా గురువు గారు చెప్పిన కథను.. ఆచరిస్తూ సమ్మర్‌ సెలవుల్లో నా స్నేహితులకు బోధిస్తున్నా. –జనగామ

నీతి: ఇతరుల సంపాదించిన సంపదపై ఆశపడకూడదు

గురువు చెప్పిన కథ

తాను గీసిన చిత్రంతో వర్షిణి

Advertisement
 
Advertisement
Advertisement