హన్మకొండ: వేసవిలో ఆర్టీసీ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను అన్నారు. సోమవారం హనుమకొండలోని టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజి యన్ కార్యాలయంలో వేసవిలో తీసుకోవాల్సిన జా గ్రత్తలపై నిర్వహించిన సమావేశంలో ఆర్‌ఎం మా ట్లాడారు. వేసవిలో వేడి గాలి నుంచి తల రక్షణ కోసం కాటన్ వస్త్రం తలపాగగా ధరించాలని, విధులకు వెళ్లినప్పుడు కనీసం 5 లీటర్ల తాగు నీటి క్యాన్ ను వెంట తీసుకెళ్లాలన్నారు. రాగి, జొన్న జావతో పాటు మజ్జిగ, కొబ్బరి నీరువంటి పానీయాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. తీవ్ర దాహం, తల, కళ్లు తిరగడం, వాంతులు రావడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స తీసుకోవాలన్నారు. సిబ్బంది ఆరోగ్యం బాగుంటేనే సంస్థ బాగుంటుందన్నా రు. అనంతరం డ్రైవర్లు, కండక్టర్లకు అందించే కరపత్రాలను ఆవిష్కరించారు. డిప్యూటీ ఆర్‌ఎంలు కేశరాజు భానుకిరణ్, పి.మహేశ్, ఆర్టీసీ డిస్పెన్సరీ వైద్యాధికారి శృతి, సూపర్ వైజర్లు పాల్గొన్నారు.
ఆర్టీసీ వరంగల్ ఆర్‌ఎం డి.విజయ భాను


