స్టేషన్‌ఘన్‌పూర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజారంజక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే చక్కటి బడ్జెట్ అని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘన్‌పూర్ డివిజన్‌కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ. 3లక్షల 24వేల కోట్ల బడ్జెట్‌లో సబ్సిడీలు, పెన్షన్లు తదితర సేవలపై రూ.లక్ష ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి రూ.8 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని ఊబిలోకి నెట్టిందన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీల నేతలు కేవలం తమ ఉనికిని చాటుకునేందుకే బడ్జెట్‌పై విమర్శలు చేస్తున్నారని, దీనిని ప్రజలు గమనించాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూనే పేదల కోసం కొత్త పథకాలకు శ్రీకారం చుడుతుందని, రాష్ట్రంలో తెల్లరేషన్‌కార్డుదారులైన కోటి 15 లక్షల కుటుంబాలకు ఇందిరమ్మ బీమా పథకాన్ని వర్తింపచేయనున్నట్లు తెలిపారు.
దేవాదులకు రూ.వెయ్యి కోట్లు కోరుతా
దేవాదుల పథకానికి రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరుతానని ఎమ్మెల్యే కడియం తెలిపారు. దేవాదుల పనులు పూర్తి చేస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఒక్క ఘన్‌పూర్ నియోజకవర్గంలోనే లక్షా 24వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఏంఎసీ చైర్‌పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాంబాబు, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్‌కుమార్, మార్కెట్, మున్సిపల్ వైస్‌చైర్మన్లు నూకల ఐలయ్య, నీల రాజమ్మగట్టయ్య, పార్టీ రాష్ట్ర నాయకులు బెలిదె వెంకన్న, మంతెన ఇంద్రారెడ్డి, మందపురం అనిల్, ఇనుగాల వెంకటేశ్వర్‌రెడ్డి, బూర్ల శంకర్, కొంతం శ్రీను, మున్సిపల్ కౌన్సిలర్లు, మార్కెట్ డైరెక్టర్లు దుంపల పద్మారెడ్డి, రాంరెడ్డి, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే
కడియం శ్రీహరి


