● వ్యక్తి అరెస్ట్, రిమాండ్
కురవి : పోలీస్ అని చెప్పి.. ఓ వ్యక్తి వద్ద నుంచి దౌర్జన్యంగా రూ.22, 300 తీసుకు న్న వ్యక్తిని సోమవారం అరెస్ట్ చేసినట్లు కురవి ఎస్సై గండ్రాతి సతీశ్ తెలిపారు. ఎ స్సై కథనం ప్రకారం.. గత ఫిబ్రవరి 15వ తేదీన కురవి వీరభద్రస్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి జాతర జరుగుతోంది. మరిపెడ మండలానికి చెందిన పులిచింత శ్రీనివాస్.. మహిళల నృత్యం చూస్తున్నాడు. ఈ సమయంలో శ్రీనివాస్ వద్దకు కుర వి క్రైమ్ కానిస్టేబుల్ అని చెప్పుకుని ‘నువ్వు మహిళల వైపు అసభ్యకరంగా చూస్తున్నావ్.. అని నిన్ను అరెస్ట్ చేస్తున్న.. డబ్బులు ఇస్తే వదిలేస్తా లేనిపక్షంలో జైలుకు పంపిస్తా’ అని బెదిరించి అతడి దగ్గర రూ.18, 400 నగదును మహబూబాబాద్ మండలం గాంధీపురానికి చెందిన ఏర్పుల నాగరాజు తీసుకున్నాడు. అంతటి వదిలేయకుండా బాధితుడి ఫోన్‌పే ద్వారా రూ.3,900 ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు. తర్వాత కొద్ది రోజులకు బాధితుడు శ్రీనివాస్‌కు అనుమానం వచ్చి కురవి పీఎస్‌లో క్రైమ్ కానిస్టేబుల్ నాగారాజు అనే వ్యక్తి ఉన్నాడా? అని వాకబు చేశాడు. ఎవరు లేరని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి నిందితుడి ఫోన్‌పే వివరాలు సేకరించి నాగరాజును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.


