గూడూరు : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని మచ్చర్ల శివారు తార్యతండాకు చెందిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్‌నాయక్ తండ్రి లచ్చనాయక్ ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ సోమవారం రాత్రి హుస్సేన్‌ను పరామర్శించారు. తొలుత లచ్చనాయక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ సీతారాంనాయక్, ఎడ్ల అశోక్‌రెడ్డి, చిలువేరు సమ్మయ్య గౌడ్, మేరెడ్డి సురేందర్, చెల్పూరు వెంకన్న, గుగ్గిళ్ల పీరయ్య మాదిగ పాల్గొన్నారు.


