
ఉపాధ్యాయుడిని నియమించాలని రోడ్డెక్కిన విద్యార్థినులు
బయ్యారం: పాఠశాలలో ఖాళీగా ఉన్న సాంఘికశాస్త్రం ఉపాధ్యాయుడిని నియమించాలని కోరుతూ గురువారం బయ్యారం బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు రోడ్డెక్కారు. ఈ సందర్భంగా గాంధీసెంటర్‌లో విద్యార్థినులు మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. విద్యార్థినుల నిరసనకు జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ బిందు మద్దతు పలికి వారి సమస్యను డీఈఓ, ఎంఈఓ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఎంఈఓ గాంధీసెంటర్‌కు చేరుకొని ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థినులు నిరసన విరమించారు. కాగా పాఠశాలలో ఖాళీగా ఉన్న సోషల్ ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేయాలని పీడీఎస్‌యూ జిల్లా కోశాధికారి మహేష్‌కుమార్ విద్యాశాఖాధికారులను కోరారు.