
ఆర్టీసీ సేవలు అస్తవ్యస్తం
డోర్నకల్: నియోజకవర్గ కేంద్రమైన డోర్నకల్‌లో ఆర్టీసీ సేవలు అస్తవ్యస్తంగా మారడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డోర్నకల్ నుంచి మహబూబాబాద్, డోర్నకల్–ఖమ్మం, మహబూ బాబాద్–గార్ల–ఖమ్మం బస్సులు నడుస్తున్నా యి. అయితే ఆయా రూట్లలో బస్సులు ఎప్పుడు వస్తా యో తెలియని పరిస్థితి నెలకొనడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
బస్టాండ్ నిరుపయోగం..
బైపాస్ రోడ్డులోని ఆర్టీసీ బస్టాండ్ నిరుపయోగంగా మారడం, బస్సుల టైంటేబుల్ లేకపోవడం, సమయానుకూలంగా బస్సులు నడవకపోవడంతో ప్ర యాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్ నిరుపయోగంగా మారడంతో ప్రయాణికులు రైల్వే స్టేషన్, గాంధీ సెంటర్ వద్ద ఎండలో బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. తరచూ రైళ్లు రద్దుకావడం, మహిళలకు ఉచిత ప్రయాణ వసతి ఉండడంతో ఆర్టీసీ బస్సులపై ఆధారపడుతున్నా రు. సరిపడా సర్వీసుల నడపకపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆ ప్రాంతాలతో ప్రత్యేక అనుబంధం..
డోర్నకల్ ప్రాంత ప్రజలకు ఇల్లెందు, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు ప్రాంతాలతో ప్రత్యేక అనుబంధం ఉంది. కాగా, కొత్తగూడెం మార్గంలో రైళ్లు సక్రమంగా నడవకపోవడం, అలాగే బస్సు సౌకర్యం లేకపోవడం, ఇల్లెందుకు ఒకే బస్సు నడుస్తుండడం ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. ప్రతీరోజు డోర్నకల్ నుంచి కొత్తగూడెం మార్గంలో వందలాది మంది ప్రయాణిస్తున్నారు. మహబూబాబాద్ నుంచి డోర్నకల్ మీదుగా భద్రాచలం వరకు ఆర్టీసీ బస్సులు నడపాలని ఈ ప్రాంత ప్రజలు చాలాకాలంగా కోరుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ఆర్టీసీ అధికారులు స్పందించి డోర్నకల్‌లో బస్టాండ్ విని యోగంలోకి తేవాలని, డోర్నకల్ మీదుగా భద్రాచలం వరకు ప్రతీరోజు బస్సులు నడపాలని స్థానికులు కోరుతున్నారు.
నిరుపయోగంగా బస్టాండ్
బస్సుల టైంటేబుల్ లేకపోవడంతో ప్రయాణికుల ఇబ్బందులు
భద్రాచలం బస్సు నడపాలని
స్థానికుల డిమాండ్