
పంచ పరివర్తనతోనే సమాజ పరివర్తన
● కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం
కేయూ క్యాంపస్: పంచ పరివర్తనతోనే సమాజ పరివర్తన సాధ్యమని కాకతీయ యూనివర్సిటీ రిజి స్ట్రార్ వి. రామచంద్రం అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్‌సంఘ్ వంద సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో గురువారం కేయూలో నిర్వహించిన విజయదశమి ఉత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. స్వ దేశీ, పర్యావరణ పరిరక్షణ, కుటుంబ వ్యవస్థ బలో పేతం, సామాజిక సామరస్యత, పౌర వ్యవస్థ బలో పేతం లాంటి అంశాలు సమాజ మార్పునకు పునా ది రాళ్లు అవుతాయన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ దేశంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో కార్యకర్తలు ఐసో లేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారని ఆహారం, ఔషధాలు కూడా సరఫరా చేశారన్నారు. ఉత్సవ వక్త, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ ఖా నాపురం ఉదయ్‌కుమార్‌మాట్లాడుతూ దేశంలో సమాజ పరివర్తన వ్యక్తి పరివర్తనతోనే సాధ్యమన్నా రు. అందుకు పంచ పరివర్తన కీలకమన్నారు. రిటైర్డ్ ఆచార్యులు చిలుకమారి సంజీవ, జి. దామోదర్, పాలకమండలి సభ్యులు డాక్టర్‌చిర్రరాజు, ప్రొఫెస ర్లు స్వర్ణలత, మామిడాల సుధాకర్, డాక్టర్ మంజుల, డాక్టర్ మమత తదితరులు పాల్గొన్నారు.