
యూరియా వచ్చేసింది..
ఖిలా వరంగల్: వరంగల్ రైల్వే స్టేషన్ గూడ్స్ షెడ్‌కు గురువారం 1,386.900 మెట్రిక్ ట న్నుల స్పిక్ కంపెనీ యూరియా, 507 మెట్రిక్ టన్నుల 20.20.013 రకం ఎరువులు చేరాయి. యూరియా వ్యాగన్‌ను కంపెనీ అధికారులు రమణరెడ్డి, తిరుమల్‌రావులతో కలిసి వ్యవసాయ అధికారులు విజ్ఞాన్, రవీందర్‌రెడ్డి పరి శీలించారు. 1,386.900 మెట్రిక్ టన్నుల స్పిక్ యూరియాను వరంగల్ జిల్లాకు 256, హనుమకొండ 250, ములుగు 240, భూపాలపల్లి 300, జనగామ జిల్లాకు 340 మెట్రిక్ టన్నులు కేటాయించారు.
ఇందిరమ్మ లబ్ధిదారులకు డబుల్ ధమాకా
● సాంకేతిక లోపంతో రెండుసార్లు రూ.లక్ష చొప్పున జమ
జనగామ: ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు సాంకేతిక లోపం డబుల్ ధమాకాతో మురిపించింది. గృహ నిర్మాణ సంస్థ సాఫ్ట్‌వేర్‌లో ఏర్పడిన సమస్యతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,300 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రెండుసార్లు రూ.లక్ష చొప్పున బిల్లులు జమయ్యాయి. ఈనెల 12, 15(శుక్రవారం, సోమవారం)వ తేదీల్లో ఒక్కో లబ్ధిదారుడి ఖాతాల్లో రెండుసార్లు రూ.లక్ష చొప్పున డిపాజిట్ అయినట్లు సమాచారం. లబ్ధిదారుల ఖాతాల్లో రెండుసార్లు డబ్బులు జమ కావడాన్ని ఆలస్యంగా గుర్తించిన ఉన్నతాధికారులు తిరిగి ప్రభుత్వ ఖాతాల్లో జమ చేయాలని గృహ నిర్మాణ శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. జనగామ జిల్లాలో సుమారు 20 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.లక్ష చొప్పున రెండు సార్లు డబ్బులు జమైనట్లు అధికారులు నిర్ధారించారు. ఈ విషయమై జనగామ హౌసింగ్ పీడీ మాతృనాయక్ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 15 మంది ఉండొచ్చని, ఎవరు కూడా డబ్బులు డ్రా చేసుకోలేదని, రేపటికల్లా తిరిగి తీసుకుంటామని చెప్పారు. ఉమ్మడి వరంగల్ పరిధి మిగతా జిల్లాలోనూ 20–30 మందికి రెండుసార్లు డబ్బులు జమ అయినట్లు తెలిసింది.
విద్యార్థులు పఠనాసక్తి
పెంపొందించుకోవాలి
హనుమకొండ డీఈఓ వాసంతి
విద్యారణ్యపురి: విద్యార్థులు పఠనాసక్తి పెంపొందించుకోవాలని హనుమకొండ జిల్లా వి ద్యాశాఖాధికారి డి.వాసంతి కోరారు. ఎల్కతుర్తి మండలం వల్భాపూర్ జిల్లా పరిషత్ హైస్కూల్‌కు విశ్రాంత ఉపాధ్యాయుడు తాడూరి రమేశ్ ఇచ్చిన రూ.50 వేల విరాళంతో గ్రంథాలయం, గ్రానైట్ యజమాని సత్యనారాయణ ఇచ్చిన రూ.50 వేలతో ల్యాబ్‌ను పీజీ హెచ్‌ఎం బద్దం సుదర్శన్‌రెడ్డి ఏర్పాటు చేయించారు. ఈ మేరకు గురువారం ల్యాబ్, గ్రంథాలయాన్ని ఆమె దాతలతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. పుస్తక పఠనంతోనే విద్యార్థుల్లో జ్ఞానం పెరుగుతుందన్నారు. మండల విద్యాశాఖాధికారి సత్యనారాయణ, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎం దుర్గాభవాని, జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ కోఆర్డినేటర్ సుదర్శన్‌రెడ్డి, పాఠశాల చైర్‌పర్సన్ నీరజ, గ్రామ మాజీ సర్పంచ్ రత్నాకర్, ప్రతాప్, రామారావు, ఉపాధ్యాయులు శ్రీనివాస్‌రెడ్డి, వెంకటస్వామి, వెంకటసుహాసిని, పద్మలత, కల్యాణి, రమాదేవి, ప్రసాద్‌రావు, అఖిల్, విద్యార్థులు పాల్గొన్నారు.

యూరియా వచ్చేసింది..

యూరియా వచ్చేసింది..