తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు | - | Sakshi
Sakshi News home page

తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు

Sep 19 2025 3:04 AM | Updated on Sep 19 2025 3:06 AM

కాజీపేట: ఆ కుటుంబ పెద్ద దుకాణంలో పనిచేస్తే రోజుకు రూ.200. ఆ ఇంటామె కూలీకి వెళ్తే రూ.300. ఆ కూలీ పని కూడా నెలలో 10 రోజులు దొరకడం కష్టమే. ఇల్లు లేదు. జాగా లేదు. ఉన్నదాంట్లో సర్దుకుపోదామనుకున్న ఆ దంపతులకు.. కూతురు ఆరోగ్యం నిద్రపట్టనివ్వట్లేదు. కాజీపేట పట్టణం బాపూజీనగర్‌ కాలనీకి చెందిన తోకల సర్వేష్‌, ప్రేమలత దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె యశ్వత (5) మానసిక స్థితి సరిగ్గా లేదు. ఇప్పటికీ నడవలేని దుస్థితి. దుకాణంలో జీతం చేసి కుటుంబాన్ని పోషించుకుంటున్న సర్వేష్‌కు కూతురుకు వైద్యం చేయించడం కష్టంగా మారింది. ఇప్పటికే రూ.4 లక్షలు చికిత్స కోసం ఖర్చు చేశారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కార్పొరేట్‌ ఆస్పత్రిలో చూపిస్తే తప్ప పరిస్థితి ఏంటో అర్థంకాదని వైద్యులు సూచించడంతో కూతురును అలా వదిలేయలేక, సరైన వైద్యం చేయించే స్తోమత లేక కన్నవాళ్లు తల్లడిల్లుతున్నారు. పూట గడవడమే కష్టంగా మారిన తల్లిదండ్రులు కార్పొరేట్‌ వైద్యం ఎలా చేయించాలో తెలియక కన్నీళ్లు పెడుతున్నారు. దాతలు ఆర్థిక సాయం అందించి చిన్నారికి ప్రాణం పోయాలని వేడుకుంటున్నారు.

ఆర్థిక సాయం అందించాలనుకుంటే..

కల్వల ప్రేమలత

యూనియన్‌ బ్యాంక్‌ కాజీపేట బ్రాంచ్‌ ,అకౌంట్‌ నంబర్‌ 122710100091805

ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ యుబీఐఎన్‌ 0802999మెయిన్‌ రోడ్‌ కాజీపేట

63008 -12559 నంబర్‌కు ఫోన్‌పే చేయవచ్చు.

ఐదేళ్ల వయసొచ్చినా మంచానికే పరిమితం

మానసిక స్థితి బాగాలేని యశ్విత

ఆస్పత్రులు తిరిగి ఉన్నదంతా ఖర్చు చేసిన తల్లిదండ్రులు

ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు

తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు1
1/1

తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement