మంగళవారం శ్రీ 5 శ్రీ ఆగస్టు శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

మంగళవారం శ్రీ 5 శ్రీ ఆగస్టు శ్రీ 2025

Aug 5 2025 8:07 AM | Updated on Aug 5 2025 8:07 AM

మంగళవ

మంగళవారం శ్రీ 5 శ్రీ ఆగస్టు శ్రీ 2025

8లోu

ఇష్టారీతిన కొనసాగుతున్న ఔషధ విక్రయాలు

జిల్లాలోని మెడికల్‌

షాపులపై అధికారుల దాడులు

అబార్షన్‌ కిట్లు అమ్ముతున్నారనే

ఆరోపణలతో పలువురికి నోటీసులు

సాక్షి, మహబూబాబాద్‌: గిరిజనులు, ఆదివాసీలు ఎక్కువగా ఉండడం.. నిరక్షరాస్యత తోడు కావడం.. డబ్బుల కోసం స్కానింగ్‌, అబార్షన్‌ చేసే డాక్టర్లు.. వెరసీ ప్రిస్క్రిప్షన్‌ అవసరం లేకుండానే జిల్లాలో మెడికల్‌ దందా ఇష్టారీతిన కొనసాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. దీని ఫలితంగా ప్రధానంగా జిల్లాలో సెక్స్‌ రేషియోలో వ్యత్యాసం ఎక్కువైంది. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఓ సర్వే ఆధారంగా ప్రతీ 1,000 పురుషులకు 836 మహిళలు మాత్రమే ఉండడం గమనార్హం. దీనిని రూపు మాపేందుకు వైద్యారోగ్య, పోలీస్‌, డ్రగ్స్‌ డిపార్టుమెంట్‌ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాయి. జిల్లాలో మెడికల్‌ షాపులు, స్కానింగ్‌ సెంటర్లపై దాడులు నిర్వహిస్తున్నాయి.

షోకాజ్‌ నోటీసుల జారీ..

ఆడపిల్లలను కడుపులోనే చిదిమేసే అబార్షన్‌ను కట్టడి చేసేందుకు డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్టేషన్‌(డీసీఏ) సీరియస్‌గా తీసుకుంది. వైద్యుల ప్రిస్క్రిప్షన్‌ లేకుండా గర్భవిచ్ఛిత్తికి దోహదపడే మందుల విక్రయాల ఆరోపణలతో జూలై రెండో వారంలో రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్‌ షాపులపై దాడుల నిర్వహించారు. ఇందులో భాగంగా మహబూబాబాద్‌ జిల్లాలో నిర్వహించిన దాడుల్లో మూడు షాపుల్లో విక్రయాలు జరుపుతున్నారనే అనుమానంతో ఆ షాపుల యజమానులకు షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. అదే విధంగా ప్రతీ నెల ఒక్కో అంశంపై మెడికల్‌ షాపుల తనిఖీలు నిర్వహించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు తెలిసింది. ఇందులో అబార్షన్‌ కిట్లు, వివిధ రకాల మత్తు మాత్రలు, వెటర్నరీ మందులు మొదలైన వాటిని పరిశీలించనున్నట్లు సమాచారం.

అబార్షన్లపై సీరియస్‌

అబార్షన్లకు కేరాఫ్‌గా పేరున్న మానుకోట జిల్లాలో కట్టడి చేసేందుకు అధికారులు సీరియస్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో ఢిల్లీకి చెందిన డాక్టర్ల బృందం జిల్లా కేంద్రంలోని స్కానింగ్‌ సెంటర్లను పరిశీలించింది. నిబంధనలు పాటించడంలేదని రెండు సెంటర్ల యజమానులకు నోటీసులు ఇచ్చి యంత్రాల ను సీజ్‌ చేసింది. అదే విధంగా కలెక్టర్‌, ఎస్పీ,జిల్లా సీ్త్ర శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రతీ నెల నిర్వహించే సీపీపీఎన్‌డీసీ సమావేశంలో భ్రూణ హత్యలు, నివారణపై సమీక్షలు నిర్వహించారు. ఇందులో మెడికల్‌ షాపుల యజమానులు, ఆర్‌ఎంపీ డాక్టర్ల ను భాగస్వామ్యులను చేసి నిబంధనల ప్రకారం న డుచుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.

నిబంధనలు పాటించాల్సిందే..

డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ లేకుండా మందుల విక్రయించడం నేరం. ప్రధానంగా అబార్షన్‌ కిట్లు, మత్తు పదార్థాల విక్రయాలపై సహించేది లేదు. గత నెలలో జిల్లాలో మెడికల్‌ షాపుల్లో తనిఖీలు నిర్వహించాం. నిబంధనలు పాటించని మూడు మెడికల్‌ షాపులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశాం.

– ఉమారాణి, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌, మహబూబాబాద్‌

న్యూస్‌రీల్‌

ఇష్టారాజ్యంగా విక్రయాలు..

మెడికల్‌ షాపుల్లో విక్రయించే టాబ్లెట్లు, ఇంజక్షన్లు, సిరప్‌లు వినియోగదారులకు విక్రయించాలంటే డాక్టర్‌ రాసిన ప్రిస్క్రిప్షన్‌ తప్పనిసరి. కానీ, మారుమూల ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రం వరకు అత్యధిక షాపుల్లో డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ లేకుండానే మందుల విక్రయాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. అయితే సాధారణ జ్వరం, తలనొప్పి, దగ్గు, డైజిన్‌ వంటి మందులే కాకుండా ప్రమాదకరమైన వాటిని కూడా డాక్టర్లతో సంబంధం లేకుండా విక్రయించడం ఆందోళనకలిగించే విషయం. ప్రధానంగా అబార్షన్‌కు దోహదపడే మెఫిఫ్రిస్టోన్‌, మీసోప్రోస్టాల్‌, నార్కోటిక్‌ డ్రగ్స్‌, ట్రమిడాల్‌, అల్ప్రాజోలమ్‌, డియాజిప్మా, నిట్రాజిప్మా, జోలీపిడమ్‌ వంటి మత్తుమందలు డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ లేకుండానే విక్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మంగళవారం శ్రీ 5 శ్రీ ఆగస్టు శ్రీ 20251
1/2

మంగళవారం శ్రీ 5 శ్రీ ఆగస్టు శ్రీ 2025

మంగళవారం శ్రీ 5 శ్రీ ఆగస్టు శ్రీ 20252
2/2

మంగళవారం శ్రీ 5 శ్రీ ఆగస్టు శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement