ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా
ఏటూరునాగారం: నిరుద్యోగులు ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని గిరిజన భవన్‌లో ఐటీడీఏ ద్వారా మెగా జాబ్‌మేళా నిర్వహించారు. జిల్లా నుంచి 357 మంది, ఇతర జిల్లాల నుంచి 21 మంది హాజరు కాగా 77 మందిని వివిధ కంపెనీలు ఎంపిక చేయగా వారికి పీఓ నియామక పత్రాలు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నిరుద్యోగులు తమకు సరైన ఉద్యోగం లేదని కాలాన్ని వృథా చేయొద్దన్నారు.
అందుబాటులో ఉన్న ఉద్యోగం చేస్తూ లక్ష్యం వైపు పయనించాలన్నారు. ఉద్యోగానికి ఎంపికై న అభ్యర్థులు నిబద్ధతతో విధులు నిర్వర్తించాలన్నారు. కార్యక్రమంలో ఏపీఓ వసంతరావు, డీడీ పోచం, ఏఓ రాజ్‌కుమార్, ఎస్‌ఓ సురేశ్‌బాబు, కిశోర్, ప్రభాకర్, శ్రీనివాస్, కొండల్‌రావు, భిక్షపతి, పాపారావు, సరస్వతి, ఏపీఎంలు, సీసీలు, వివిధ కంపెనీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
● కిలో 300 గ్రాముల సరుకు స్వాధీనం
● వివరాలు వెల్లడించిన సీఐ జానకిరామ్‌రెడ్డి
పాలకుర్తి టౌన్: గంజాయి విక్రయిస్తున్న ము ఠాను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పాలకుర్తి సీఐ వంగాల జానకిరామ్‌రెడ్డి తెలిపా రు. ఈ మేరకు బుధవారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. స్టేషన్ ఘన్‌పూర్ మండలం కొత్తపల్లికి చెందిన వడ్లకొండ శబరి నాథ్, గోవిందా శ్రీనాథ్, సముద్రాల గ్రామానికి చెందిన గుండె నవీన్, పాలకుర్తి మండలం గూడూరుకు చెందిన గుగ్గిళ్ల ప్రవీణ్, గుండమల్ల సంపత్, లక్ష్మీనారాయణపురం గ్రామానికి చెందిన చిటూరి శ్యామ్, పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన బండారి అఖిల్ ముఠాగా ఏర్పడ్డారు. గంజాయి కొనుగోలు చేసి విద్యార్థులు, యువతకు విక్రయిస్తున్నారు.
ఈ క్రమంలో పాలకుర్తి శివారు కూసిగుట్ట సమీపంలో గంజాయి ముఠా ఉందనే సమాచారం మేరకు ఎస్సై దూలం వపన్‌కుమార్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. కేజీ 300 గ్రాముల ఎండు గంజాయి, ఒక బైక్, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి