జానాల గుట్టకు ఎసరు.. | - | Sakshi
Sakshi News home page

జానాల గుట్టకు ఎసరు..

Aug 5 2025 8:07 AM | Updated on Aug 5 2025 8:07 AM

జానాల

జానాల గుట్టకు ఎసరు..

మరిపెడ రూరల్‌: ఓ వ్యక్తి గుట్టకు రాళ్లు కొట్టుకుంటూ ఉపాధి పొందుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడని గ్రామస్తులు వదిలేశారు. ఇదే అదనుగా భావించిన ఆ వ్యక్తి సమీపంలోని మరో వ్యక్తితో కలిసి ప్రభుత్వ గుట్టుకే ఎసరు పెట్టాడు. గుట్టుచప్పుడు కాకుండా గుట్టరాళ్లను తొలగిస్తూ శిఖంలోని భూమిని సదనం చేస్తున్నారు. గ్రామస్తులు అడ్డుకోవడంతో విషయం బట్టబయలైంది. ఇందుకు గ్రామంలో కొందరు ముడుపులు పుచ్చుకుని సహకరించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా.. రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

ఓ దాత ప్రభుత్వానికి దానం

మరిపెడ మండలం వీరారం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 301లో 29 ఎకరాల్లో జానాల గుట్ట కొంత భూమి కలిగి ఉంది. గ్రామానికి చెందిన భూస్వామి దామిడి రాములమ్మ సుమారు 20 ఏళ్ల క్రితం గ్రామాభివృద్ధి కోసం దానం చేశారు. దీనిని గ్రామస్తులు అప్పటి రెవెన్యూ అధికారుల ద్వారా ప్రభుత్వ ఆస్తిగా పరిగణించేలా ప్రభుత్వానికి భూమి పట్టా పాస్‌పుస్తకాలను అప్పగించారు. అప్పటి నుంచి ప్రభుత్వ భూమిగా పరిగణిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో గుట్ట సమీపంలో గ్రామస్తుల సౌకర్యార్ధంగా శ్మశానవాటిక, క్రీడాప్రాంగణం ఏర్పాటు చేశారు.

జరిమానాతో సరి..

ఈ విషయం ఇటీవల గ్రామస్తులకు తెలియడంతో పెద్ద సంఖ్యలో గుట్ట వద్దకు చేరుకుని రాళ్లు తొలగిస్తున్న యంత్రాన్ని అడ్డుకున్నారు. రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి యంత్రాన్ని సీజ్‌ చేసి రూ.10 వేలు జరిమానా విధించి వదిలేసిట్లు తెలుస్తుంది. విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు గురి చేస్తున్న విషయం తెలిసిన స్థానిక రెవెన్యూ అధికారులు పెద్దగా చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికై నా జిల్లా రెవెన్యూ ఉన్నతాధికారులు స్పందించి దాత ప్రభుత్వానికి దానం చేసిన భూమిని కబ్జాకు గురికాకుండా చూసి, ఆక్రమణకు యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

హద్దులు ఏర్పాటు చేయాలి

ఇప్పటికే జానాల గుట్ట శిఖం భూమి కొంత కబ్జాకు గురైంది. ఓ దాత దానం చేసిన భూమిని కాపాడుకోవడంతో అధికారులు విఫలమయ్యారు. ఇప్పటికై నా రెవెన్యూ అధికారులు సర్వే చేయించి 29 ఎకరాల గుట్ట భూమికి హద్దులు గుర్తించాలి.

– జెట్టి రాములు, వీరారం

కబ్జాకు ప్రయత్నం

గ్రామంలోని ఓ వ్యక్తి ఉపాధి నిమిత్తం 20 ఏళ్లుగా గుట్టకు పునాది రాళ్లు కొట్టుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గ్రామస్తులు సైతం చూసీచూడనట్లు ఉన్నారు. ఇదే అదనుగా భావించిన సదరు వ్యక్తి 15 మంది అనుచర బృందాన్ని ఏర్పాటు చేసుకుని రాళ్లు కొట్టిస్తూ ఉపాధికి బదులు రాళ్ల వ్యాపారం, కమీషన్లు తీసుకోవడం మొదలు పెట్టాడు. అంతటితో ఆగకుండా మరో వ్యక్తితో కుమ్మకై ప్రభుత్వ భూమి ఆక్రమణకు ప్లాన్‌ చేశాడు. అనుకున్నదే తడవుగా యంత్రాలతో గుట్ట శిఖంలోని పెద్ద రాళ్లను తొలగించడం మొదలు పెట్టారు. గుట్ట శిఖంలో ఉన్న ప్రభుత్వ భూమి చదును చేసి కబ్జాకు యత్నించారు. ఈ తతంగానికి గ్రామానికి చెందిన కొందరు ముడుపులు తీసుకుని సహకరించినట్లుగా వినికిడి.

గుట్టుచప్పుడు కాకుండా బండరాళ్ల తొలగింపు

ఓ వ్యక్తికి గుట్ట శిఖం భూమిని

అప్పనంగా అప్పగించే ప్రయత్నం

గ్రామస్తులు అడ్డుకోవడంతో

విషయం బట్టబయలు

జానాల గుట్టకు ఎసరు..1
1/1

జానాల గుట్టకు ఎసరు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement