
సత్వరమే పరిష్కరించాలి
మహబూబాబాద్: ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్‌కుమార్ వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా లెనిన్ వత్సల్ టొప్పో మాట్లాడుతూ.. పెండింగ్ వినతులను కూడా వెంటనే పరిష్కరించాలన్నారు. పరిష్కారం సాధ్యం కానివి ఉంటే కారణాలతో కూడిన నివేదిక అందజేయాలన్నారు. సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం అనే విషయాన్ని గమనించి పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణిలో 169 వినతులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా ప్రతీ ప్రజావాణికి దివ్యాంగులు తమ సమస్యలు పరిష్కరించాలని వస్తున్నారు. అయితే సమస్యలు పరిష్కారంకావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి ఆటో తీసుకుని వస్తే రవాణా చార్జీలు మీద పడుతున్నాయే తప్ప సమస్యకు పరిష్కారం దొరకడం లేదని వాపోతున్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ పురుషోత్తం, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
స్కూటీ మంజూరు చేయాలి
నా కూతురు శిల్ప డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. మొదటి, రెండో సంవత్సవం కాలేజీ ఫస్ట్ వచ్చింది. స్కూటీ కోసం దరఖాస్తు చేసుకున్నాం. స్కూటీ ఉంటే కాలేజీకి వెళ్లడానికి అనుకూలంగా ఉంటుంది. మంజూరు చేయాలి.
–దివ్యాంగురాలు శిల్ప తల్లి కళ, తొర్రూరు
అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో
ప్రజావాణిలో 169అర్జీల స్వీకరణ
ఇబ్బందులు పడుతున్నాం: దివ్యాంగులు

సత్వరమే పరిష్కరించాలి