మహబూబాబాద్: హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్‌ను సోమవారం మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా కలిశారు. కుటుంబ సభ్యులతో కేటీఆర్ ఆప్యాయంగా మాట్లాడారని ఆమె తెలిపారు.
జిల్లాకు ఇద్దరు ఎస్సైలు, ఒక ఏఎస్సై
మహబూబాబాద్ రూరల్ : జిల్లాకు ఇద్దరు ఎస్సైలు, ఒక ఏఎస్సైని కేటాయిస్తూ పోలీసుశాఖ ఉన్నతాధికారులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా వారు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్‌ను జిల్లా పోలీసు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాకు వచ్చిన వారిలో ఎస్సైలు బోడ వీరన్న, మిర్యాల సంజీవరెడ్డి, ఏఎస్సై చల్ల యాదవరెడ్డి ఉన్నారు.
హెచ్‌ఐవీని నియంత్రించాలి
డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్
నెహ్రూసెంటర్: జిల్లాలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నియంత్రణకు సిబ్బంది సమర్థవంతంగా పని చేయాలని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో సోమవారం హెచ్‌ఐవీపై సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. హెచ్‌ఐవీ నిర్ధారణ, చికిత్స, అవగాహన కార్యక్రమాల నిర్వహణకు అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. సమావేశంలో ప్రోగ్రాం అధికారి విజయ్‌కుమార్, హెచ్‌ఈ కేవీ రాజు, సబ్‌యూనిట్ ఆఫీసర్ రామకృష్ణ, మేనేజర్ జ్యోతి, క్లినికల్ సర్వీస్ ఆఫీసర్ సారయ్య, మహేశ్, ఐసీటీసీస్టాఫ్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
కోటగుళ్లలో ప్రత్యేక పూజలు
గణపురం: తొలి శ్రావణ సోమవారం సందర్భంగా గణపురం మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి గణపేశ్వరుడికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు నాగరాజు ఆధ్వర్యంలో స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరిచి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.
కేటీఆర్‌ను కలిసిన మాజీ ఎంపీ కవిత
కేటీఆర్‌ను కలిసిన మాజీ ఎంపీ కవిత
కేటీఆర్‌ను కలిసిన మాజీ ఎంపీ కవిత