చిన్నతనంలోనే పెళ్లి! | - | Sakshi
Sakshi News home page

చిన్నతనంలోనే పెళ్లి!

Jun 14 2025 9:58 AM | Updated on Jun 14 2025 9:58 AM

చిన్న

చిన్నతనంలోనే పెళ్లి!

సాక్షి, మహబూబాబాద్‌: యుక్తవయస్సు రాకముందు వివాహాలు జరిగితే మగవారికి బాధ్యత తెలియదు.. ఆడవారి ఆరోగ్యం సహకరించదు. చదువుకునే వయస్సులో పెళ్లిళ్లు చేసుకుంటే ఎన్నో బాధలు, మరెన్నో కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. కాగా ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. ఎంత మంది ఉద్యోగులతో నిఘా పెట్టిన జిల్లాలో బాల్య వివాహాలు ఆగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. గ్రామస్థాయి నుంచి నెట్‌వర్క్‌ ఉన్నప్పటికీ ఆశించినస్థాయిలో బాల్య వివాహాలను అడ్డుకోలేక పోతున్నారు. వివాహ తంతు ముగిసిన తర్వాత సమాచారం తెలుస్తుండడంతో అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు.

291 వివాహాలు అడ్డుకున్న అధికారులు

జిల్లా వ్యాప్తంగా గత నాలుగు సంవత్సరాల్లో 291బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. గిరిజనులు, ఆదివాసీలు ఎక్కువగా ఉన్న జిల్లా కావడంతో బాలల హక్కులు, చట్టాలపై అవగాహన లేకపోవడం, ఆకర్షణకు లోనై పెద్దలకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటున్నారు. ఆడపిల్లలు ఎక్కువగా ఉన్న కుటుంబాల్లో తొందరగా పెళ్లి చేస్తే తమ బాధ్యత తీరుతుందనే ఆలోచనతో తల్లిదండ్రులు బాల్యవివాహాలు చేస్తున్నారు.

అడ్డుకున్నవి తక్కువే..

ప్రతీ సంవత్సరం వందల సంఖ్యలో బాల్య వివాహాలు జరుగుతుంటే.. పదుల సంఖ్యలో మా త్రమే అడ్డుకుంటున్నారనే విమర్శలు వస్తున్నా యి. బాలల సంరక్షణ, హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాలను అడ్డుకోవడం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, దత్తత, వీధి బాలల సంరక్షణ, అనాథ పిల్లల సంరక్షణ మొదలైన వాటికోసం జిల్లాలో అంగన్‌వాడీ సెంటర్లు, చైల్డ్‌లైన్‌, బాలల పరిరక్షణ, మహిళా సాధికారత వంటి విభాగాలతోపాటు, పలు స్వచ్ఛంద సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. ఇంత నెట్‌వర్క్‌ ఉన్నప్పటికీ బాల్య వివాహాలను పూర్తి స్థాయిలో అడ్డుకోలేకపోతున్నట్లు విమర్శలు ఉన్నాయి. బాలల సంక్షేమం కోసం ప్రతీ జిల్లాలో ఒక చైర్మన్‌, నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. కానీ జిల్లాలో చైర్‌పర్సన్‌, మరో ఇద్దరు కమిటీ సభ్యులు మాత్రమే ఉన్నారు. వీరిలో సమన్వయం లేకపోవడంతో బాలల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న సేవలు క్షేత్ర స్థాయికి చేరడం లేదని విమర్శలు ఉన్నాయి. అదే విధంగా బాల్య వివాహాలతో జరిగే అనర్థాలు, ప్రమాదాలపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించకపోవడం, ప్రతీ నెల సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్షలు నిర్వహించినా పెద్దగా పట్టించుకోవడంలేదని విమర్శ ఉంది. దీనికి తోడు ఫిర్యాదులుకు స్పందించకపోవడం, రాజకీయ ఒత్తిడికి తలొగ్గడం, పలువురు ఉద్యోగులు కాసులకు కక్కుర్తిపడి గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి జరిగేలా ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

క్షేత్ర స్థాయి నుంచి కట్టడి చేస్తాం

జిల్లాలో బాల్య వివాహాల సంఖ్య ఎక్కువగా ఉండడం బాధాకరం. దీనిని అదుపు చేయడం కోసం జిల్లా ఉన్నతాధికారుల సహకారంతో క్షేత్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాం. గిరిజన ప్రాంతాలు, మారుమూల పల్లెల్లో సైతం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. బాల్య వివాహాలను పూర్తి స్థాయిలో నిర్మూలించాలంటే అదరి సహకారం కావాలి.

–రాజ్యలక్ష్మి, బాలరక్షాభవన్‌ కోఆర్డినేటర్‌

నాలుగు సంవత్సరాలుగా

జిల్లాలోని అడ్డుకున్న

బాల్య వివాహాల వివరాలు..

2021లో 109

2022 68

2023 37

2024 53

2025 24

(ఇప్పటి వరకు)

మొత్తం 291

జిల్లాలో ఆగని బాల్య వివాహాలు

అవగాహన లేకపోవడంతో అనర్థాలు

ప్రేక్షక పాత్రలో అధికారులు

వివాహం తర్వాత సమాచారంతో ఏమీ చేయలేని పరిస్థితి

అదుపు చేయకపోతే అంతే సంగతులు..

జిల్లాలో జరుగుతున్న బాల్య వివాహాలను అదుపు చేయకపోతే భవిష్యత్‌ ప్రమాదకరంగా మారుతుందని డాక్టర్లు, మానసికవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని ఏజెన్సీ గూడేలు, గిరిజన తండాల్లో చిన్నతనంలో పెళ్లిళ్లు చేసుకుని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళలు ఎక్కువగా ఉన్నారు. రక్తహీనత, గైనిక్‌ సమస్యలతో సతమతమవుతున్నవారు అధికంగా ఉన్నారు. చిన్నతనంలో వివాహాలు, కుటుంబ పోషణ భారం, భార్యాభర్తల మధ్య సమన్వయం లేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. అదేవిధంగా సీ్త్ర, పురుషుల నిష్పత్తిలో 1000 మంది పురుషులకు 836 మంది సీ్త్రలు ఉన్నట్లు జాతీయ ఆరోగ్య సంస్థ తేల్చి చెప్పింది.

చిన్నతనంలోనే పెళ్లి!1
1/1

చిన్నతనంలోనే పెళ్లి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement