
ఆస్తి కోసమే హత్య!
హసన్‌పర్తి: ఆస్తి కోసమే పిన తల్లి (చిన్నమ్మ)ని కుమారుడు గొడ్డలితో నరికి హత్యచేశాడని హనుమకొండ ఏసీపీ నర్సింహారావు అన్నారు. ఈ మేరకు కేయూ పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్య వివరాలు వెల్లడించారు. హసన్‌పర్తి మండలం పెగడపల్లికి చెందిన చల్లా శ్రీనివాస్‌రెడ్డి మొదటి భార్యకు ముగ్గురు కుమారులు. 30ఏళ్ల క్రితం మొదటి భార్య వనమ్మ మృతి చెందగా, వివిధ కారణాలతో ఇద్దరు కుమారులు కూడా తనువు చాలించారు. చిన్న కుమారుడు చల్లా భూపాల్‌రెడ్డి ఆలనా పాలనా తండ్రి శ్రీనివాస్‌రెడ్డి చూసుకున్నాడు. కొంతకాలం తర్వాత సరోజన అనే మహిళను శ్రీనివాస్‌రెడ్డి రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు.
ఆస్తి తగదా..
శ్రీనివాస్‌రెడ్డి తనకున్న భూమిలో నుంచి 3.20 ఎకరాల భూమిని రెండో భార్య కూతుళ్లు పేర రిజిస్ట్రేషన్ చేయించాడు. దీంతో తనకు తెలియకుండా చెల్లెళ్ల పేరిట భూమి రిజిస్ట్రేషన్ చేయడంతో ఆ కుటుంబంలో గొడవలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు ఆ గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి.
కొడుకుకు భూమి కౌలుకు ఇవ్వొద్దు..
కాగా, పదిరోజుల క్రితం శ్రీనివాస్‌రెడ్డి కాలుకు దెబ్బ తగలడంతో వ్యవసాయ పనులకు దూరమయ్యాడు. దీంతో తన పేరిట ఉన్న 2.20 ఎకరాల భూమిని కొడుకు చల్లా భూపాల్‌రెడ్డికి కౌలుకు ఇవ్వాలని నిర్ణయించాడు. దీంతో భార్య సరోజన నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. ఆ భూమిని అల్లుళ్లకు కౌలుకు ఇవ్వాలని సరోజన వాదిస్తూ వచ్చింది.
పథకంప్రకారం హత్య..
తనకు తెలియకుండానే 3.20 ఎకరాల భూమిని కూతుళ్ల పేరిట రిజిస్ట్రేషన్‌చేసుకోవడమే కాకుండా తండ్రి భూమిని కూడా అల్లుళ్లకు ఇవ్వాలని పినతల్లి గొడవ చేయడంతో ఆమెనుఎలాగైనా హత్యచేయాలని భూపాల్‌రెడ్డి పథకం పన్నాడు. ఇందులో భాగంగా ఈనెల 11వ తేదీ అర్ధరాత్రి పిన తల్లి సరోజన బయట నుంచి ఇంట్లోకి వస్తుండగా గేట్ వద్ద గొడ్డలితో నరికి హత్యచేశాడు. ఈ ఘటనపై మృతురాలి భర్త శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని 24 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ వివరించారు. కాగా, నిందితుడిని పట్టుకోవడంతో ప్రతిభ కనబరిచిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్, ఎస్సైలు రవీందర్, శ్రీకాంత్, సిబ్బందిని ఏసీపీ అభినందించారు.
పథకం ప్రకారమే మర్డర్
పినతల్లిని చంపిన కొడుకు..
24 గంటల్లోనే నిందితుడిని
పట్టుకున్నాం
హనుమకొండ ఏపీసీ నర్సింహారావు