
విలువైన ప్రాణాలను కాపాడొచ్చు..
ప్రతీ సంవత్సరం అక్టోబర్లో నిర్వహించే పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా నిర్వహించే రక్తదాన శిబిరంలో పాల్గొంటాను. గ్రామాల్లోని యువతకు రక్తదానంపై అవగాహన కల్పించి ఎంతో మందిచే రక్తదానాన్ని చేయించాను. రక్తదానంపై అపోహలను నివృత్తి చేస్తూ ముందుకు సాగేలా కృషి చేశాను. భవిష్యత్లో కూడా యువతను రక్తదానం చేసేలా ప్రోత్సహిస్తూ నేను చేసేందుకు సిద్దంగా ఉన్నాను. ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేయడం వల్ల ప్రాణాలను కాపాడొచ్చు.
– దాసరి సుధాకర్, ఎస్సై టేకుమట్ల