తెలంగాణ ప్రజానీకానికి కాంగ్రెస్ ద్రోహం
ఎల్కతుర్తి: ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేసి అమలు చేయకుండా తెలంగాణ ప్రజానీకానికి కాంగ్రెస్ ప్ర భుత్వం ద్రోహం చేసిందని శాసనమండలి ప్రతి పక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లి సమీపంలో నిర్వహించనున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ సభాస్థలిలో జరుగుతున్న ఏర్పాట్లను ఆదివారం బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చింతం సదానందంతో కలిసి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మధుసూదనాచారి మాట్లాడుతూ 14 ఏళ్ల ఉద్య మం తర్వాత పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో కేసీఆర్ అద్భుత పాలన అందించారన్నారు. దేశంలోనే తె లంగాణ రాష్ట్రాన్ని రోల్ మోడల్‌గా నిలబెట్టారని వివరించారు. గడిచిన 16 మాసాల కాలం నుంచి కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తూనే ఉందన్నారు. తె లంగాణ ప్రజల ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరించడం కాంగ్రెస్ నైజమని దుయ్యబట్టారు. హు స్నాబాద్ నుంచి వస్తుంటే చెరువులన్నీ ఎండిపోయి ఉన్నాయని, సంవత్సరంన్నర క్రితం జలాశయాలన్నీ నీటితో కళకళలాడేవని గుర్తు చేశారు. ప్రపంచం మెచ్చుకునే రీతిలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తాగు, సాగునీరు కష్టాలు లేకుండా చేసిన నేత కేసీఆర్ అని కొనియాడారు. ఇప్పుడు కాళేశ్వరం నీటిని వాడుకునే చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు లేదన్నారు. ఇదిలా కొనసాగితే తెలంగాణలో కరువు, కాటకాలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు ద్రోహం కలుగుతుంటే ప్రజల తరఫున గొంతు విప్పడానికే కేసీఆర్ సభ నిర్వహిస్తున్నారని చెప్పారు. అందుకే రాష్ట్రంలోని ప్రతీ ఇంటి నుంచి తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరా రు. అంతకు ముందు మునుగోడు, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి సభాస్థలిని పరిశీలించారు.
శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి


