పత్తికొండ డీఎస్పీగా వంశీధర్‌ గౌడ్‌ | - | Sakshi
Sakshi News home page

పత్తికొండ డీఎస్పీగా వంశీధర్‌ గౌడ్‌

Oct 7 2026 12:58 AM | Updated on Oct 7 2026 12:58 AM

కర్నూలు: పత్తికొండ డీఎస్పీగా వంశీధర్‌ గౌడ్‌ నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం ఎన్‌టీఆర్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో ట్రాఫిక్‌ ఏసీపీగా విధులు నిర్వహిస్తున్నారు. గత నెల 30న ఐదుగురు డీఎస్పీలకు స్థానచలనం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా పత్తికొండలో విధులు నిర్వహిస్తున్న వెంకటరామయ్య అన్నమయ్య జిల్లా రాజంపేటకు బదిలీ అయ్యారు. ఖాళీగా ఉన్న డీఎస్పీ స్థానంలో వంశీధర్‌ గౌడ్‌ను నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. నంద్యాల జిల్లాకు చెందిన ఈయన 1991లో పోలీసు శాఖలో ఎస్‌ఐగా విధుల్లో చేరారు. 2004లో సీఐగా పదోన్నతి పొంది వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. 2014లో డీఎస్పీగా పదోన్నతి పొంది కర్నూలు ఇంటెలిజెన్స్‌ విభాగం, మైదుకూరు, చిత్తూరులో ఎస్సీ, ఎస్టీ సెల్‌లో పనిచేసి ఎన్‌టీఆర్‌ పోలీస్‌ కమిషనరేట్‌లోని ట్రాఫిక్‌ విభాగానికి బదిలీ అయ్యారు. మూడేళ్లుగా అక్కడ విధులు నిర్వహించి పత్తికొండ డీఎస్పీగా బదిలీపై వస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement