కుట్రలతో బీసీ ఎమ్మెల్యేను జైలుకు పంపడం దుర్మార్గం | - | Sakshi
Sakshi News home page

కుట్రలతో బీసీ ఎమ్మెల్యేను జైలుకు పంపడం దుర్మార్గం

Oct 7 2026 12:58 AM | Updated on Oct 7 2026 12:58 AM

కర్నూలు(టౌన్‌): ‘చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. భర్తే తన భార్య బట్టలు చింపితే బీసీ నాయకుడు, ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షిపై అక్రమ కేసులతో జైలుకు పంపడం దుర్మార్గం’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్‌ రెడ్డి అన్నారు. మంగళవారం కర్నూలు నగర శివారులోని పంచలింగాల జిల్లా జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యేని ఎమ్మెల్సీ డాక్టర్‌ మధుసూదన్‌, పార్టీ రాష్ట్ర నాయకులు రామచంద్రారెడ్డితో కలిసి ఆయన పరామర్శించారు. అనంతరం బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం చెప్పిందని పోలీసులు సైతం ఎలాంటి విచారణ లేకుండా తప్పుడు కేసులు నమోదు చేశారన్నారు. భర్తే బట్టలు చింపినట్లు స్పష్టంగా వీడియోలు సైతం వెలుగులోకి వచ్చాయన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారనే ఈ విషయం ఈ ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. నియోజకవర్గ ప్రజల్లో ఆయనకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతోందని, అక్రమ కేసులతో వేధిస్తున్న టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. 67 రోజలకు పైగా అక్రమంగా ఆలూరు ఎమ్మెల్యేను జైలులో పెట్టడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. చేతనైతే ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయాలని, ప్రజాదరణ కలిగిన వైఎస్సార్‌సీపీ నాయకులను టార్గెట్‌ చేసి ఇబ్బందు లు సృష్టించడం తగదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement