స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించాలి

Oct 7 2026 12:58 AM | Updated on Oct 7 2026 12:58 AM

● జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సిరి

● జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సిరి

ఓర్వకల్లు: జిల్లాలోని పరిశ్రమల్లో స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలలో ప్రాధాన్యం కల్పించాలని జిల్లా కలెక్టర్‌ డా.ఏ.సిరి అన్నారు. మంగళవా రం గుట్టపాడు, బ్రాహ్మణపల్లె గ్రామాల వద్ద ఏర్పాటు చేసిన జైరాజ్‌ ఇస్పాత్‌, రిలయన్స్‌ కన్స్యూమర్స్‌ ప్రోడక్ట్‌ లిమిటెడ్‌ ప్లాంట్లను పరిశీలించారు. ముందుగా కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, ఉపా ధి కల్పన తదితర అంశాలపై సంబంధిత యాజమా న్య ప్రతినిధులతో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌ డాక్టర్‌ కృష్ణయ్య, జిల్లా కలెక్టర్‌ సిరి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ.. మామిడి జ్యూస్‌ తయారీలో తోతాపురి, అల్ఫోన్సో రకాలతో పాటు, స్థానికంగా, విస్తారంగా లభించే బంగినపల్లి మామిడిని పానీయాలలో వినియోగించే అవకాశాలను పరిశీలించాలని రిలయ న్స్‌ యాజమాన్యానికి సూచించారు. పర్యావరణ నిబంధనల మేరకు ప్రాజెక్టు వ్యయంలో కొంత మొత్తా న్ని ప్రభావిత గ్రామాల వాస్తవ అవసరాలకు అనుగుణంగా కేటాయించాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ.. నైపుణ్యం లేని స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కోల్పోకుండా పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందించాలని యాజమాన్య ప్రతినిధులకు సూచించారు. కార్యక్రమానికి ముందు గా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌, జిల్లా కలెక్టర్‌ పరిశ్రమ ఆవరణంలో మొక్కలు నాటారు. అనంతరం రిలయన్స్‌ ప్లాంట్‌లో తయారవుతున్న పానీయాల విధానాన్ని వారు పరిశీలించారు. కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ సందీప్‌ కుమార్‌, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ మధుసూదన్‌రెడ్డి, కాలుష్య నియంత్రణ బోర్డు ఈఈ కిశోర్‌రెడ్డి, పరిశ్రమల శాఖ అధికారి సంజీవరాజు, రిలయన్స్‌ కన్స్యూమర్స్‌ ప్రోడక్ట్‌ లిమిటెడ్‌ ప్లాంట్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement