గ్రామ పంచాయతీల వివరాలు... | - | Sakshi
Sakshi News home page

గ్రామ పంచాయతీల వివరాలు...

Oct 7 2026 12:58 AM | Updated on Oct 7 2026 12:58 AM

గ్రామ పంచాయతీల వివరాలు...

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల వివరాలు ....

బీసీలను ఇంకా నమ్మించేందుకు సుప్రీం కోర్టుకు వెళ్తామంటూ ప్రచారం

క్షేత్ర స్థాయిలో శరవేగంగా సాగుతున్న ఎన్నికల ప్రక్రియ

8వ తేదీ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ

కర్నూలు(అర్బన్‌): స్థానిక సంస్థల (మున్సిపల్‌, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ) ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతోంది. న్యాయస్థానాల్లో వీగిపోతుందని తెలిసినా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 34 శాతం పెంచుతూ జీఓ ఇచ్చింది. ఈ జీవోను హైకోర్టు రద్దు చేసింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ ఉన్నాయి. అయినా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతుండడాన్ని బీసీ మేధావి వర్గం తప్పుబడుతోంది. కేవలం బీసీల ఓట్ల కోసమే సుప్రీంకోర్టు అంటూ కాలయాపన చేయడం తప్ప మరొకటి కాదని వారంటున్నారు. అయితే, రిజర్వేషన్ల అంశంపై స్పష్టత రాకున్నా, క్షేత్ర స్థాయిలో మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు చేపట్టాల్సిన కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని పనులు నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు అందుతున్నాయి. ఎస్‌ఈసీ ఆదేశాల మేరకు స్థానిక ఎన్నికల పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులు వేగం పెంచారు. అందుకు అనుగుణంగా .. ఈ నెల 8వ తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మూడు విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు?

నోటిఫికేషన్‌ ఎప్పుడు వచ్చినా, జిల్లాలో మూడు విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని జిల్లా అధికార యంత్రాంగం ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మొదటి విడతలో ఆదోని డివిజన్‌లోని 10 మండలాలకు చెందిన 203 గ్రామ పంచాయతీలు, రెండో విడతలో పత్తికొండ డివిజన్‌లోని 9 మండలాలకు చెందిన 155 గ్రామ పంచాయతీలు, మూడో విడతలో కర్నూలు డివిజన్‌లోని 7 మండలాలకు చెందిన 126 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు.

సిద్ధంగా ఎన్నికల సామగ్రి

ఎన్నికల నిర్వహణకు సంబంధించి బ్యాలెట్‌ బాక్సులతో పాటు బ్యాలెట్‌ పేపర్లు, గ్రీన్‌ పేపర్‌ సీల్స్‌, ఎస్‌ఈసీ అప్రూవ్‌ చేసిన స్టాట్యుటరీ కవర్స్‌, నాన్‌ స్టాట్యుటరీ కవర్లతో పాటు ఇండెలిబుల్‌ ఇంక్‌ బాటిల్స్‌ కూడా సరఫరా అయ్యాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి జిల్లాకు 19.9 మెట్రిక్‌ టన్నుల బ్యాలెట్‌ పేపర్‌ వచ్చింది. అలాగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు 22 వేల కేజీల పింక్‌, వైట్‌ ఓవ్‌ పేపర్‌, 21,500 గ్రీన్‌ పేపర్‌ సీల్స్‌, 6,100 ఇంక్‌ బాటిల్స్‌ కూడా వచ్చాయి.

ఆర్థిక సంఘం నిధులపైనే ఆధారం

స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులే ఆధారం. గ్రామ పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్‌ 2వ తేదీతో ముగిసింది. అలాగే మండల పరిషత్‌, జెడ్పీ పాలకవర్గాల పదవీ కాలం ఈ ఏడాది ఆగస్టు 23, 24వ తేదీతో ముగిశాయి. స్థానిక సంస్థలకు పాలకవర్గాలు లేకుంటే ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యే అవకాశాలు లేవు. 15వ ఆర్థిక సంఘం మొదటి విడత నిధులు 2025 డిసెంబర్‌ నెలలో ఉమ్మడి జిల్లాకు రూ. 84.72 కోట్లు విడుదల అయ్యాయి. ఈ మేరకు 2వ విడత నిదులు ఈ ఏడాది మార్చి నాటికి విడుదల కావాల్సి ఉంది. గ్రామ పంచాయతీల్లో పాలకవర్గాలు లేకపోవడం వల్ల నేటికి 2వ విడత నిధులు విడుదల కాలేదు. 16వ ఆర్థిక సంఘం కూడా ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ప్రారంభమైంది.అయితే స్థానిక సంస్థలకు పాలకవర్గాలు లేకపోవడం వల్ల ఈ నిధుల విడుదలలో ఇంకా కొంత జాప్యం చోటు చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

అంచనాల్లో రాజకీయ నేతలు

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లపై ఎలాంటి స్పష్టత రాకున్నా, గ్రామీణ ప్రాంతాల్లోని రాజకీయ నేతలు అంచనాల్లో మునిగిపోతున్నారు. గత రెండు మూడు దఫాలుగా వచ్చిన రిజర్వేషన్‌ను బేరీజు వేసుకుంటూ ఈసారి తప్పక ఫలానా కేటగిరీకి రిజర్వేషన్‌ అవుతుందనే అంచనాకు వస్తున్నారు. ఈ క్రమంలోనే తమ కేటగిరికి చెందిన వారి గురించి వాకబు చేస్తు వారిని ఎన్నికల్లో పోటీ చేయించేందుకు సమాయత్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా పార్టీలకు చెందిన నేతలను కలుస్తు తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

మొత్తం జెడ్పీటీసీలు... 26

ఎంపీపీలు... 26

మొత్తం ఎంపీటీసీలు... 432

పోలింగ్‌ కేంద్రాలు... 1432

బ్యాలెట్‌ బాక్సులు... 1631

( పెద్దవి, మీడియం, చిన్నవి)

రిజర్వేషన్లపై ‘కూటమి’ ఎత్తుగడకు హైకోర్టు బ్రేక్‌

జిల్లాలో మొత్తం గ్రామ పంచాయతీలు... 484 మొత్తం వార్డులు... 5,100

మొత్తం ఓటర్లు 12,50,166 మంది

పురుషులు... 6,21,167 సీ్త్రలు... 6,28,834 ఇతరులు... 165

పోలింగ్‌ కేంద్రాలు ... 5244

బ్యాలెట్‌ బాక్సులు ... 2046 ( పెద్దవి, మీడియం, చిన్నవి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement