16 ఏళ్లకు ఆదోనికి మళ్లీ ఐపీఎస్‌ అధికారి | - | Sakshi
Sakshi News home page

16 ఏళ్లకు ఆదోనికి మళ్లీ ఐపీఎస్‌ అధికారి

Oct 7 2026 12:58 AM | Updated on Oct 7 2026 12:58 AM

ఆదోని: ఆదోని సబ్‌ డివిజన్‌ పోలీ సు అధికారిగా మహిళా ఐపీఎస్‌ జయశర్మను నియమిస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. దా దాపు 16 ఏళ్ల తర్వాత మరోసారి మహిళా ఐపీఎస్‌ అధికారి ఇక్కడ బాధ్యతలు చేపట్టనుండటం విశేషం. ఆదోనిలో పోలీసు సబ్‌ డివిజన్‌ కార్యాలయం అవసరాన్ని అప్పటి బ్రిటీషు ప్రభుత్వం 1929లోనే గుర్తించింది. ఒక ఎకరా 8 సెంట్లను రూ.1,500లకు కొను గోలు చేసి అధికారిక బంగ్లాను నిర్మి ంచారు. శతాబ్దం దాటిన ఈ సబ్‌ డివిజన్‌ పోలీసు కార్యాలయం ఎంతో మంది అధికారుల సేవలకు సాక్ష్యంగా నిలిచింది. 1982 నుంచి ఇప్పటివరకు ఐపీఎస్‌ అధికారుల సంఖ్యను పరిశీలిస్తే పట్టుమని పది మంది కూడా లేకపోవడం గమనార్హం. వీరిలోనూ ఎక్కువ కాలం కొనసాగిన వారు అరుదు. 1982 నుంచి 1987 వరకు ఐపీఎస్‌ అధికారులు తమ సేవలందించారు. ఆ తర్వాత 23 సంవత్సరాల వరకు ఏ ఐపీఎస్‌ అధికారినీ నియమించలేదు. 2010లో షిమోషీ భాజపాయ్‌ అనే మహిళా ఐపీఎస్‌ అధికారి సుమారు రెండేళ్లపాటు ఆదోనిలో పనిచేశారు. ఆమె తర్వాత 16 సంవత్సరాలకు మళ్లీ జయశర్మ నియమితులయ్యారు.

వెంకటరమణకు రెండు నెలల్లోనే బదిలీ

విశాఖపట్టణం నుంచి ఆదోనికి వచ్చిన డీఎస్‌పీ వెంకటరమణ కేవలం రెండు నెలల వ్యవధిలోనే నెల్లూరుకు బదిలీ కావడం చర్చనీయాంశంగా మారింది. జయశర్మకు తొలుత మదనపల్లెకు పోస్టింగ్‌ ఇచ్చినట్లు సమాచారం. అయితే పోస్టింగ్‌ను మార్చి ఆదోనికి కేటాయించడం గమనార్హం. 2024 బ్యాచ్‌కు చెందిన జయశర్మ స్వగ్రామం హర్యాణా రాష్ట్రం హిస్సార్‌ జిల్లా భార్వ అనే చిన్న గ్రామం. గ్రేహౌండ్స్‌ అసాల్ట్‌ కమాండర్‌గా ఉన్న ఆమెను ఆదోని ఏఎస్‌పీగా బదిలీపై రానున్నారు.

ఐపీఎస్‌ అధికారి పేరు పనిచేసిన కాలం

టీ.పీ.దాస్‌ 08.04.1982 – 20.12.1983

వివేక్‌ దూబె 21.12.1983 – 30.11.1985

సత్యేంద్ర ప్రతిహస్థ్‌ 20.12.1985 – 08.05.1986

ఎస్‌.వి.రమణమూర్తి 25.05.1986 – 03.01.1987

షీమోషీ బాజ్‌పాయ్‌ 13.12.2010 – 07.03.2013

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement