కర్నూలు(అగ్రికల్చర్): సామాజిక భద్రత పింఛన్లకు కేంద్రం వాటా మొత్తం నవంబర్ నుంచి నేరుగా బ్యాంకు ఖాతాలకు జమ కానుంది. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లలో కేంద్రం వాటా ఉంది. ఈ మొత్తం ఇక నుంచి బ్యాంకు ఖాతాల్లో జమ కానుండగా.. మిగిలిన మొత్తం యథావిధిగా నగదు రూపంలోనే అందజేస్తారు. వృద్ధాప్య, వితంతు పింఛన్లలో కేంద్రం వాటా రూ.200, వికలాంగుల పింఛన్లలో కేంద్రం వాటా రూ.300 ఉంది. మిగిలిన పింఛన్లలో కేంద్రం వాటా లేదు. లబ్ధిదారులకు కేంద్రం వాటా జమ కావాలంటే ప్రతి ఒక్కరికీ ఆధార్ లింకు కలిగిన బ్యాంకు ఖాతా తప్పనిసరి. ఈ నేపథ్యంలో వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛను పొందుతున్న లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాలను సరిచూసుకోవాలని డీఆర్‌డీఏ అధికారులు సూచించారు.
ఆలూరు ఎమ్మెల్యే కేసులో తీర్పు రేపటికి రిజర్వ్
ఆదోని: ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షిపై అక్రమంగా నమోదు చేసిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో బెయిల్‌కు సంబంధించి ఏపీ హైకోర్టులో మంగళవారం వాదోపవాదాలు ముగిశా యి. తీర్పును గురువారానికి రిజర్వ్ చేశారు. ఎమ్మెల్యే తరపు న్యాయవాదిగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయనకు సహాయ, సహకారులుగా వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి జీవన్‌సింగ్, లక్ష్మీకాంత్ వాదనలు వినిపించారు. కేసుకు సంబంధించిన అంశాలపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. గురువారానికి వెలువరించే తీర్పుపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
కేఎంసీలో డిప్లొమా కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజీలో ఏపీ స్టేట్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ సర్వీసెస్ డిప్లమో కోర్సులకు ఇంటర్‌మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు పూరించిన దరఖాస్తులను ఈ నెల 14వ తేది సాయంత్రం 5 గంటల్లోగా తమ కార్యాలయంలో రూ.100 రుసుము చెల్లించి అందజేయాలన్నారు. పోస్టు ద్వారా వచ్చిన దరఖాస్తులు స్వీకరించబోమన్నారు. దరఖాస్తులు a psahpc.co.in అనే వెబ్‌సైట్‌లో లభిస్తాయన్నారు. ఈ నెల 23న కౌన్సెలింగ్ నిర్వహిస్తామని.. బైపీసీ చదివిన విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుందన్నారు
రానున్న ఐదు రోజులు వర్షాలు లేనట్లే!
కర్నూలు(అగ్రికల్చర్):రానున్న ఐదు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం లేదు. ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు వాతావరణం వివరాలను గుంటూరులో ని గ్రామీణ వ్యవసాయ వాతావరణ సేవా కేంద్రం విడుదల చేసింది. ఇటు కర్నూలు, అటు నంద్యాల జిల్లాల్లో రానున్న ఐదు రోజులు పొ డి వాతావరణం ఉంటుందని వాతావరణ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఉష్ణోగ్రతలు పెరి గిపోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నా రు. మంగళవారం కర్నూలులో 37.3 డిగ్రీలు, నంద్యాలలో 36.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు ఒకటి, రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది.
తగ్గిన ఉల్లి ధర
కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లి గడ్డల ధరలు తగ్గుతున్నా యి. వేరుశనగ, మొక్కజొన్న, సజ్జ లు తదితర పంటల ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో పంటలన్నీ దెబ్బతిన్నాయి. దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో అంతంతమాత్రం ఉన్న పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లభించాల్సి ఉండగా.. తగ్గుతుండటం గమనార్హం. మార్కెట్‌కు ఉల్లిగడ్డలు 3,346 క్వింటాళ్లు(100 లాట్లు) వచ్చా యి. కనిష్ట ధర రూ.829, గరిష్ట ధర రూ.3,869 లభించగా.. సగటు ధర రూ.3,589 నమోదైంది. వేరుశనగ ధర కూడా తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. కనిష్ట ధర రూ.2,222, గరిష్ట ధర రూ.8,730 లభించగా.. సగటు ధర రూ.7,300 పలికింది. మొక్కజొన్నలు మార్కెట్‌కు 60 క్వింటాళ్లు వచ్చాయి. కనిష్ట ధర రూ.2,376, గరిష్ట ధర రూ.2,489 లభించింది. కొర్రలకు రూ.3,331, సజ్జలకు రూ.2,851 ప్రకారం గరిష్ట ధరలు లభించాయి.


