కర్నూలు(సెంట్రల్): సిమెంట్ పరిశ్రమల్లో సాలిడ్‌వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్‌తో పాటు కాలుష్య నియంత్రణ నిబంధనలన పాటించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ పి.కృష్ణయ్య సూచించారు. మంగళవారం నగరంలోని కాలుష్య నియ ంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయంలో రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌తో కలిసి ఆయన రాయలసీమ జిల్లాల్లోని సిమెంట్ పరిశ్రమల యాజమాన్యాలు, ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిమెంట్ పరిశ్రమల్లో 33 శాతం పచ్చదనాన్ని కచ్చితంగా పెంపొందించాలని, పరిసర ప్రాంతాల ప్రజల పొలాలు కాలుష్యం బారిన పడకుండా చూడాలని ఆదేశించారు. సిమెంట్ రవాణా చేసే భారీ వాహనాల వల్ల రోడ్లు దెబ్బ తింటున్నాయని, రోడ్ల అభివృద్ధిలో కూడా భాగస్వాము లు కావాలని సూచించారు. పరిశ్రమలు సీఎస్‌ఆర్ నిధులు ఖర్చు చేసి ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. సమావేశంలో కాలుష్య నియంత్రణ మండలి జాయింట్ చీఫ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ రమేష్, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ పీవీ కిషోర్ రెడ్డి, సిమెంట్ పరిశ్రమల యాజమాన్యాల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ సిరితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు.


