ఆదోని: పట్టణంలోని అరుణ్‌జ్యోతి నగర్‌కు చెందిన బీజేపీ నాయకుడు యువరాజ్ సోమవారం వైఎస్సార్స్‌సీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే, ఆదోని నియోజకవర్గ సమన్వయకర్త సాయిప్రసాద్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. బీజేపీలో ఎంతో కాలంగా నమ్మకంగా పనిచేస్తున్న ఆయన వైఎస్సార్స్‌సీపీలో చేరడం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా బీజీపీ ఎమ్మెల్యే పార్థసారథికి విధేయుడిగా ఉన్న వ్యక్తి పార్టీని వీడి వైఎస్సార్స్‌సీపీలో చేరడంతో ఆ పార్టీ శ్రేణలు ఆలోచనలో పడినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ సందర్భంగా యువరాజ్ మాట్లాడుతూ పార్టీకి నమ్మకంగా పనిచేస్తానని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులను ధైర్యంగా ఎదుర్కొని పార్టీ కోసం పనిచేస్తానన్నారు. ఈ సందర్బంగా మాజీ ఎంఎల్‌ఏ సాయిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ తీరుపై చాలా మంది అసంతృప్తితో ఉన్నారని, తనతో కలిసి పనిచేసేందుకు వైఎస్సార్‌సీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సమయం వచ్చినప్పుడు అనేక మంది వైఎస్సార్సీపీలో చేరుతారన్నారు.


