కర్ణాటక, తెలంగాణ, గోవా నుంచి మద్యం దిగుమతి | - | Sakshi
Sakshi News home page

కర్ణాటక, తెలంగాణ, గోవా నుంచి మద్యం దిగుమతి

Oct 6 2026 1:36 AM | Updated on Oct 6 2026 1:36 AM

జిల్లాను ముంచెత్తుతున్న కల్తీ మద్యం

తెలంగాణ, గోవా, అటు కర్ణాటక ప్రాంతాల నుంచి కర్నూలు, నంద్యాల ప్రాంతాలకు పెద్ద ఎత్తున మద్యం దిగుమతి అవుతోంది. మన రాష్ట్రంలోని మద్యంతో పోలిస్తే గోవాలో మద్యం ధర 50 శాతం తక్కువ ఉండగా.. తెలంగాణలో కొన్ని బ్రాండ్లు ఒక్కో ఫుల్‌బాటిల్‌పై రూ.500 వరకు తక్కువకు లభిస్తోంది. పైగా తెలంగాణ రాష్ట్రం కర్నూలుకు సరిహద్దుగా ఉండడంతో అలంపూర్‌కు వెళ్లి పెద్ద ఎత్తున మద్యాన్ని కర్నూలుకు తరలిస్తున్నారు. మరోవైపు కర్ణాటక నుంచి సరిహద్దు ప్రాంతాలైన ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు, మంత్రాలయం ప్రాంతాలకు నాసిరకం మద్యం పెద్ద ఎత్తున దిగుమతి చేసుకొని అమ్మకాలు సాగిస్తున్నారు. అయితే పోలీసులు మొక్కుబడిగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు.

సాక్షి ప్రతినిధి, కర్నూలు: మద్యం వ్యాపారంలో మామూళ్ల దందా శృతి మించడంతో వ్యాపారులు అక్రమాలకు తెగబడుతున్నట్లు తెలుస్తోంది. ఇబ్బడిముబ్బడిగా లైసెన్స్‌ ఫీజు పెంచడం, నియోజకవర్గ పచ్చనేతలతో పాటు ఎకై ్సజ్‌, సివిల్‌, ట్రాఫిక్‌ పోలీసు మొదలుకొని పలువురికి పెద్ద మొత్తంలో నెలమామూళ్లు సమర్పించాల్సి రావడంతో నష్టాల నుంచి గట్టెక్కేందుకు పలు మద్యం దుకాణాల యజమానులు పెద్ద ఎత్తున అక్రమాలకు తెరతీశారు. కల్తీమద్యం అమ్మకాలతో పాటు గోవా, తెలంగాణల నుంచి నాసిరకం మద్యం దిగుమతి చేసుకొని అమ్మకాలు సాగిస్తున్నారు. కొందరు వ్యాపారులు మద్యంలో నీళ్లు కలుపుతుండగా.. మరికొంద రు వ్యాపారులు ప్రమాదమని తెలిసినా కల్తీలో మత్తు తగ్గకుండా కొన్ని రకాల మత్తుపదార్థాలను కలుపుతున్నట్లు తెలుస్తోంది. మద్యంప్రియుల ఆరోగ్యం పాడయ్యే పరిస్థితులు ఉన్నా రాబడి కోసం ఈ తరహా అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం.

పచ్చనేతల వసూళ్లపర్వం

గత ప్రభుత్వంలో లేని విధంగా నియోజకవర్గానికి చెందిన పచ్చనేత ఒక్కో మద్యం దుకాణం నుంచి నెలకు రు.లక్ష వసూలు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అదేవిధంగా ఎకై ్సజ్‌, మద్యం డిపో, సివిల్‌ పోలీసులతో పాటు ట్రాఫిక్‌ పోలీసులు కొందరికి నెల మామూళ్లు ముట్టజెప్పాల్సి వస్తోందని దుకాణ యజమానులు వాపోతున్నారు. ఈ లెక్కన ఒక్కో దుకాణం నెలకు రూ. 2.5 లక్షలు నెల మామూళ్ల కింద చెల్లించాల్సి వస్తోందని అంచనా. ఇది కాకుండా లెసెన్స్‌ ఫీజులు, రూము అద్దెలు, సిబ్బంది జీతాలు ఉండనే ఉన్నాయి. దీంతో అక్రమాలకు పాల్పడాల్సి వస్తోందని కొందరు మద్యం వ్యాపారులు బాహాటంగా పేర్కొంటున్నారు.

సిండికేట్‌గా ‘తమ్ముళ్లు’

ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 222 మద్యం దుకాణాలు ఉండగా తాజాగా ప్రభుత్వం వాటిని రెన్యూవల్‌ చేసింది. ఒక్కో దుకాణానికి అదనంగా రూ.27 లక్షల మొత్తాన్ని చెల్లిస్తే ఏడాదిపాటు దుకాణం రెన్యూవల్‌ చేస్తోంది. దీంతో మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగే 178 దుకాణాల యజమానులు రెన్యూవల్‌ చేసుకోగా మిగిలిన 44 దుకాణాదారులు అందుకు అంగీకరించకపోవడంతో వాటికి ఎకై ్సజ్‌ శాఖ టెండర్లు పిలిచింది. లక్కీడిప్‌ ద్వారా దుకాణాలను ఖరారు చేసేందుకు ఎకై ్సజ్‌ శాఖ సిద్ధమైంది. మద్యం దుకాణానికి ఒక్కో దరఖాస్తు విలువ రూ.3 లక్షలు చొప్పున కనీసం 9 దరఖాస్తుల విలువ కట్టి రూ.27 లక్షలు చెల్లించేలా నిబంధన విధించింది. అయితే గతంలో నాలుగు దరఖాస్తులు వచ్చిన దుకాణాలకు టెండర్లలో లక్కీడిప్‌ నిర్వహించి దుకాణాలు కేటాయించే నిబంధన ఉన్నందున జిల్లాలో తెలుగు తమ్ముళ్లు సిండికేట్‌ అయ్యారు.

యథేచ్ఛగా కల్తీ

జిల్లా వ్యాప్తంగా కొందరు మద్యం షాపుల యజమానులు మద్యంలో నీటిని కలిపి కల్తీ చేస్తున్నారు. ఇందుకోసం మూతలు తొలగించి తిరిగి సీల్‌ వేసేందుకు టెక్నికల్‌ టీంను పెట్టుకొని పనికానిస్తున్నారు. మద్యంలో నీళ్లు కల్తీ చేస్తుండడంతో మత్తు తక్కువకాకుండా పలురకాల కెమికల్స్‌ను సైతం కలుపుతున్నట్లు సమాచారం. ఇదే కాకుండా కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల నుంచి నాసిరకం మద్యాన్ని దిగుమతి చేసుకొని కల్తీ చేసి మరీ అమ్మకాలు సాగిస్తున్నారు. కట్టడిచేయాల్సిన పోలీసులు నెలమామూళ్ల మత్తులో జోగుతుండటం గమనార్హం.

నెల మామూళ్లు ఇచ్చుకోలేక

యజమానుల అడ్డదారి

ఒక్కో దుకాణం నుంచి

రూ.2.5లక్షల వసూలు

‘పచ్చ’నేతలతో పాటు ఎకై ్సజ్‌,

సివిల్‌ పోలీసులకు వాటాలు

కర్ణాటక, తమిళనాడు,

గోవా నుంచి దిగుమతి

నీళ్లు కలిపేందుకూ వెనుకాడని

దుకాణాదారులు

మత్తు మోతాదు తగ్గకుండా

మద్యంలో రసాయనాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement