● జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి
ఓర్వకల్లు: డ్రోన్ సిటీ తొలిదశ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. ఓర్వకల్లు మండలం కొమరోలు గ్రామపరిధిలో డ్రోన్ సిటీ మొదటి దశ పనులను సోమవారం ఆమె పరిశీలించారు. రోడ్లు, డ్రెయిన్లను నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. నీటి సరఫరా పనులను కూడా సాధ్యమైంత త్వరగా పూర్తి చేయాలన్నారు. ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం, సంప్ పనులను నెలన్నరలోగా పూర్తి చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ వెంట కర్నూలు ఆర్‌డీఓ సందీప్ కుమార్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ మధుసూదన్‌రెడ్డి, పరిశ్రమల అధికారి సంజీవ రాజు, ఏపీఐఐసీ అధికారి సందీప్, తహసీల్దార్ విద్యా సాగర్ ఉన్నారు.


