కర్నూలు డీఎఫ్‌వోగా వెంకట సుబ్బయ్య | - | Sakshi
Sakshi News home page

కర్నూలు డీఎఫ్‌వోగా వెంకట సుబ్బయ్య

Oct 6 2026 1:36 AM | Updated on Oct 6 2026 1:36 AM

కర్నూలు కల్చరల్‌: అటవీ శాఖ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ కర్నూలు డీఎఫ్‌వోగా ఎ.వెంకట సుబ్బయ్య సోమవారం బాధ్యతలను స్వీకరించారు. జంగారెడ్డి గూడెం డివిజన్‌లో సబ్‌ డీఎఫ్‌వోగా విధులు నిర్వహిస్తున్న ఆయన ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌ 2025 లోకల్‌ క్యాడర్‌ అలాట్‌మెంట్‌లో భాగంగా కర్నూలు డీఎఫ్‌వోగా నియమితులయ్యారు. ఈ మేరకు ఇప్పటి వరకు ఇన్‌చార్జ్‌ డీఎఫ్‌వోగా ఉన్న కర్నూలు అటవీ శాఖ అధికారి పి.శ్యామల నుంచి వెంకట సుబ్బయ్య బాధ్యతలు స్వీకరించారు.

వన్‌స్టాప్‌ సెంటర్‌లో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

కర్నూలు(అర్బన్‌): మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదోనిలో కొనసాగుతున్న వన్‌స్టాప్‌ సెంటర్‌లో ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్‌ పీడీ పి.విజయ తెలిపారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 2025 జూలై 1వ తేది నాటికి 18 నుంచి 39 సంవత్సరాల్లోపు ఉండాలన్నారు. ఆదోనిలో నివాసం ఉంటున్న వారికి ప్రాధాన్యత ఇస్తామని, పూర్తి నోటిఫికేషన్‌, ఇతర వివరాలకు కలెక్టరేట్‌లోని తమ కార్యాలయం లేదా www.kur noo.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు. దరఖాస్తులను ఈ నెల 6 నుంచి 12వ తేది వరకు కలెక్టరేట్‌లోని ఐసీడీఎస్‌ పీడీ కార్యాలయం రూం నెం.122లో అందించాలన్నారు.

సా..గుతున్న ఖరీఫ్‌ పంటల నమోదు

● ఈ నెల 10 వరకు గడువు పొడిగింపు

కర్నూలు(అగ్రికల్చర్‌): ఖరీఫ్‌ ముగిసింది. రబీ సీజన్‌ మొదలై వారం అవుతోంది. కానీ ఖరీఫ్‌ పంటల నమోదు ప్రక్రియ మాత్రం సాగుతూనే ఉంది. పంటల నమోదులో అలసత్వం కారణంగా గడువును పొడిగిస్తూనే ఉన్నారు. మామూలుగా ఖరీఫ్‌ పంటలను ఈ–క్రాప్‌లో నమోదు చేయడం సెప్టెంబర్‌ చివరి నాటికే పూర్తి కావాల్సి ఉంది. కానీ భారీగా పెండింగ్‌లో ఉండటంతో ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించారు. సాగు ఉన్నా.. లేకపోయినా ప్రతి సర్వే నెంబర్‌లోకి వెళ్లి పంటలను నమోదు చేయాలి. పంట లేకపోతే బీడుగా నమోదు చేయాలి. జిల్లాలో 9,67,950 సర్వే నెంబర్లు ఉండగా.. 9,16,749 సర్వే నెంబర్లను నమో దు చేశారు. ఖరీఫ్‌ సాధారణ సాగు 4,34,996 హెక్టార్లు ఉండగా.. 96 శాతం వరకు మాత్రమే పంటలను నమోదు చేయడం గమనార్హం.

ఇళ్ల వద్దకే పోస్టులో కనకదుర్గమ్మ ప్రసాదం

కర్నూలు(అర్బన్‌): దసరా పర్వదినాల సందర్భంగా విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మ వారి ప్రసాదాన్ని నేరుగా జిల్లాలోని భక్తుల ఇళ్లకు చేర్చే సదుపాయాన్ని పోస్టల్‌ శాఖ తీసుకొచ్చిందని కర్నూలు డివిజన్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌ జి.జనార్దన్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులు తమ సమీపంలోని పోస్టాఫీసులో దసరా పర్వదినానికి వారం రోజుల ముందు ప్రసాదాన్ని బుక్‌ చేసుకుంటే పోస్ట్‌మ్యాన్‌ ద్వారా డెలివరీ చేస్తామన్నారు. ప్రసాద ప్యాకేజీ ధర రూ.116లు మాత్రమేనని, ఇందులో కనకదుర్గ అమ్మవారి లాకెట్‌, అ మ్మవారి శక్తికంకణ దారం, కుంకుమ, అక్షింతలు, కనకదుర్గ అమ్మవారి ప్రభ పుస్తకం, అమ్మవారి ప్రసాదం ఉంటాయన్నారు.

యూపీఎస్సీ ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షలకు

ఉచిత శిక్షణ

కర్నూలు(అర్బన్‌): బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని గొల్లపూడి బీసీ భవన్‌లో యూీపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ కె.ప్రసూన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు చెందిన ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ వర్గాల అభ్యర్థులు దరఖాస్తును ఈ నెల 20వ తేది సాయంత్రం 5 గంటల్లోపు స్వయంగా వచ్చి అందించాలన్నారు. అభ్యర్థుల ఎంపిక ఈనెల 27న స్క్రీనింగ్‌ టెస్ట్‌ ప్రాతిపదికన చేపడతామని, ఎంపికై న అభ్యర్థులకు విజయవాడలో శిక్షణనిస్తారన్నారు. శిక్షణా కాలంలో ఉచిత బస, వసతి సౌకర్యాలను కల్పిస్తామన్నారు. వివరాలకు 08518–236076, 9652093661 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement