బియ్యం ధర తగ్గించాలి. సామన్యులు బియ్యం కొని తినలేని పరిస్థితులు ఉన్నా యి. నేను గతేడాది వరి పండించి బస్తా రూ.1,575 చొప్పున విక్రయించాను. ఇప్పుడు సాగు లేకపోవడంతో ధరలు పెరిగాయి. ప్రభుత్వం వెంటనే స్పందించాలి.
– వెంకటేశ్వర్లు, కాపులపల్లి
బియ్యం ధర పెరగడం గతంలో ఎప్పుడూ లేదు. రైతుల వద్ద తక్కువ రేటుకు కొని వ్యాపారులు నిల్వ చేసుకున్నారు. వాటిని అమ్మకుండా ధర పెంచుతున్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. నిల్వ ఉన్న ధాన్యాన్ని బయటకు తీసి ధర తగ్గించాలి.
– సుబ్బారెడ్డి, రైతు, ఇల్లూరుకొత్తపేట


