ప్రయాణం కొన‘సాగు’తోంది! | - | Sakshi
Sakshi News home page

ప్రయాణం కొన‘సాగు’తోంది!

Oct 4 2026 9:37 AM | Updated on Oct 4 2026 9:37 AM

శాస్త్ర, సాంకేతిక రంగం ఎంత పెరిగినా గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు, పశువులకు మధ్య ఉన్న అనుబంధానికి నిదర్శనమే ఈ చిత్రం. ప్రస్తుతం ఒక చోటు మరో ప్రాంతానికి వెళ్లేందుకు గూగుల్‌ మ్యాప్‌లో లొకేషన్‌ సెట్‌ చేస్తే ఎవరినీ అడగాల్సిన అవసరం లేకుండా నేరుగా వాహనాల్లో గమ్యానికి వెళ్లిపోవచ్చు. డ్రైవర్‌ లెస్‌ వాహనాలు దగ్గరిలోనే ఉన్నాయి. అయితే ఇంత సాంకేతిక పరిజ్ఞానం లేని కాలం నుంచి ఇప్పటికీ పల్లెల్లో పశువుల వెంట ఎవరూ లేకపోయినా పొలాల నుంచి నేరుగా ఇంటికి చేరుకోవడం చూస్తుంటాం. గూడూరులో కర్నూలు రోడ్డు చిన్నకాలువ వద్ద ఓ దృశ్యం అందరినీ కట్టిపడేసింది. పొలంలో ఎండలో కష్టపడి ఇంటికి బయలుదేరిన ఓ రైతు తీవ్ర అలసటతో ఎద్దుల బండిపైనే నిద్రలోకి జారుకున్నాడు. యజమాని నిద్రిస్తున్నాడని గ్రహించిన ఆ ఎద్దులు.. క్రమశిక్షణతో రహదారికి ఒక పక్కగా తమ గమ్యస్థానం వైపు పయనిస్తూ కనిపించాయి. – గూడూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement