కొత్తపల్లి: శ్రీశైలం జలాశయంలో రోజు రోజుకు నీటిమట్టం తగ్గుముఖం పడుతుండటంతో త్వరలో సంగమేశ్వరుడు జలాధివాసం వీడనున్నాడు. సోమవారం జలాశయం నీటిమట్టం 843 అడుగులకు చేరుకుంది. నీటి మట్టం తగ్గడంతో సప్తనదీ సంగమ ప్రాంతంలో వెలసిన ప్రాచీన సంగమేశ్వరాలయం క్రమేపీ కృష్ణమ్మ ఒడిని వీడుతోంది. ప్రస్తుతం ఆలయం చుట్టూ ఉన్న ప్రహరీ కింది భాగం వరకు నీటి మట్టం ఉంది. దీంతో మరో వారం రోజుల్లో పూర్తి స్థాయిలో సంగమేశ్వరాల యం జలాధీవాసం వీడనుంది. కాగా ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీశైలం వెళ్తున్న కన్నడ భక్తులు ఈ ఏడాది అధిక సంఖ్యలో సంగమేశ్వరాలయాన్ని సందర్శించేందుకు రావడం విశేషం. ఆయల పురోహితులు తెలకపల్లి రఘురామ శర్మ ఆధ్వర్యంలో ఎగువన ఉన్న ఉమామహేశ్వరాలయంలోని శివలింగానికి కర్ణాటక భక్తులు పూజలు నిర్వహించుకున్నారు.


