మోటారు సైకిళ్ల
దొంగలు అరెస్టు
కర్నూలు (టౌన్): వెూటారు సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను (ఒకరు మైనర్) పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 14 వ తేదీ వెల్దుర్తి మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన కార్తీక్ అనే వ్యక్తి కర్నూలు మార్కెట్ యార్డు వద్ద మోటారు సైకిల్‌ను పార్కింగ్ చేశారు. యార్డులోకి వెళ్లి వచ్చేలోపు వాహనం కనిపించలేదు. దీంతో బాధితుడు నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే వెంకటరమణకాలనీకి చెందిన కార్తీక్ స్థానికంగా ట్రెండ్ మచ్చాలో సేల్స్‌బాయ్‌గా పనిచేస్తున్నాడు. తన మోటార్ సైకిల్‌ను షాపు వద్ద పార్కింగ్ చేయగా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీఐ విక్రమసింహరెడ్డి, ఎస్‌ఐలు చంద్రశేఖర్ రెడ్డి, శరత్ కుమార్ రెడ్డి, సిబ్బంది మురళీధర్, సుబ్బారాయుడు, గోవింద్‌లు టీమ్‌లుగా ఏర్పడి అందుబాటులో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. కర్నూలు నగరంలోని బాపూజీ నగర్‌కు చెందిన మల్లెపోగు చెన్నయ్య, సమీప బంధువు ఒక మైనర్ బాలుడు ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి రూ. 7 లక్షలు విలువ చేసే ఆరు వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.


