వ్యక్తి బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

వ్యక్తి బలవన్మరణం

Jan 28 2026 7:00 AM | Updated on Jan 28 2026 7:00 AM

వ్యక్తి బలవన్మరణం

వ్యక్తి బలవన్మరణం

బేతంచెర్ల: మండల పరిధిలోని సిమెంట్‌ నగర్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఏఎస్‌ఐ నబీసాహెబ్‌ తెలిపిన వివరాల మేరకు.. నంద్యాలకు చెందిన గంటశాల పవన్‌ కుమార్‌ (38)కు సిమెంట్‌ నగర్‌ గ్రామా నికి చెందిన కవితతో 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. జీవనోపాధి నిమిత్తం భార్య స్వగ్రామంలోనే స్థిరపడ్డారు. అయితే, కొంత కాలంగా మద్యానికి బానిసై భార్య కవితను వేధించడం మొదలుపెట్డాడు. సోమవారం రాత్రి కూడా గొడవ పడటంతో పిల్లలను తీసుకొని కవిత తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. దీంతో మనస్థాపానికి గురైన పవన్‌ కుమార్‌ (38) మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తర్వాత కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి అన్న హనుకుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement