మంత్రాలయం: ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీమఠం ప్రాంగణంలో ఉదయం సంస్కృత విద్యార్థులతో వేద మంత్రోచ్ఛరణల మధ్య పీఠాధిపతి తైల అభ్యంగణ, కుటుంబ సభ్యులచే హారతి గావించారు. పీఠాధిపతికి శ్రీమఠం సిబ్బంది భక్తిశ్రద్ధలతో గురు వందనం సమర్పించి, పుష్ప వృష్టి, గజమాలతో సన్మానించారు. యాగశాలలో పవిత్ర యజ్ఞహోమాలు చేశారు. శ్రీ మూల రాములకు ప్రత్యేక పూజలు చేసి పీఠాధిపతి మహామంగళ హారతి గావించారు. సుజయింద్ర ఆరోగ్య శాలలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. గ్రామ ప్రజలు వైద్య సేవలు పొందారు. అనంతరం భక్తులకు తులసి మొక్కలను పంపిణీ చేశారు.


