ఆకుపై నేతాజీ
దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సైన్యాన్ని స్థాపించి ఆంగ్లేయులకు ముచ్చెమటలు పట్టించిన స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రాన్ని ఓ విద్యార్థి రావి ఆకుపై ఆవిష్కరించాడు. ఈ నెల 23న ఆయన జయంతి సందర్భంగా స్థానిక నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థి ఎం. ఈరన్న రావి ఆకుపై ఆజాద్ చిత్రాన్ని రూపొందించాడు. ఎంఈఓ–2 శ్రీనివాసులు, పాఠశాల హెచ్‌ఎం ఫయాజుద్దీన్, డ్రాయింగ్ ఉపాధ్యాయుడు ఎన్.కీర, ఉపాధ్యాయులు అభినందించారు. – ఆదోని సెంట్రల్
ఆకుపై నేతాజీ


