వసంత పంచమికి సర్వం సిద్ధం
● అమ్మవారికి నేడు శ్రీశైలం దేవస్థానం
పట్టు వస్త్రాల సమర్పణ
● చిన్నారులకు సామూహిక
అక్షరాభ్యాసాలు
కొత్తపల్లి: కొలను భారతీ క్షేత్రంలో శుక్రవారం జరిగే వసంత పంచమి వేడుకలకు సర్వం సిద్ధమైనట్లు ఈఈ నరసింహారెడ్డి, శ్రీశైలం దేవస్థానం ఏఈఓ ఫణిందర్ ప్రసాద్ తెలిపారు. గురువారం వారు క్షేత్రంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రీశైలం దేవస్థానం కొలనుభారతి క్షేత్రాన్ని దత్తత తీసుకున్న తర్వాత మొదటిసారి జరిగే వసంత పంచమి వేడుకలు అన్నారు. ఈ ఏడాది సుమారు 20 వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. భక్తుల సౌకర్యార్థం క్యూలై న్లు, వాహనాల పార్కింగ్, సేమియానాలు, ఆలయాలకు విద్యుత్ అలంకరణ, ఫ్లవర్ డెకరేషన్ ఏర్పాటు చేశామన్నారు. చిన్నారుల సామూహిక అక్షరాభ్యాసాలు చేసే ప్రదేశాన్ని తీర్చిదిద్దామన్నా రు. అక్షరాభ్యాసాలు చేయించుకున్న చిన్నారుల తల్లిదండ్రులకు అమ్మవారి దర్శనం కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశామన్నారు. క్షేత్ర పరిసరాల్లోని సప్తశివాలయాల్లో భక్తులు పూజలు చేసుకునేందుకు వసతులు కల్పించామన్నారు. క్షేత్రంలో కొ లువైన సరస్వతి అమ్మవారికి శుక్రవారం ఉదయం 4 గంటలకు మంగళహారతితో పూజలు ప్రార ంభం చేస్తారన్నారు. 5.25 గంటలకు శ్రీశైలం దేవస్థానం నుంచి తెచ్చిన పట్టు వస్త్రాలను శ్రీశైలం ఈవో శ్రీనివాసరావు, చైర్మన్ రమేష్ నాయుడు తదితరులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తామన్నా రు. అదేవిధంగా వాహనాల రద్దీని నియంర్రించేందుకు, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా 70 మంది పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. ఆత్మకూరు సీఐ మహేశ్వరరెడ్డి, తహసీల్దార్ ఉమారాణి, ఎస్‌ఐ జయశేఖర్ ఏర్పాట్ల ను పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు చేపడతామన్నారు.


