అటవీ సంరక్షణలో సిబ్బంది కీలకం
● ఆత్మకూరు వన్యప్రాణి డిప్యూటీ డైరెక్టర్
విఘ్నేష్ ఆపావ్
ఆత్మకూరు: అటవీ సంరక్షణలో ఎఫ్‌బీవో, ఏపీఓలు, సిబ్బంది కీలకమని ఆత్మకూరు డివిజన్ వన్యప్రాణి డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ ఆపావ్ అన్నారు. గురువారం సాయంత్రం పట్టణంలో వన్యప్రాణి డివిజన్ కార్యాలయంలో జూనియర్ ఫారెస్టు అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో 2026 సంవత్సరం నూతన క్యాలెండర్, డైరీలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విఘ్నేష్ ఆపావ్ మాట్లాడుతూ అటవీ సంపద, పెద్ద పులుల సంరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయన్నారు. అడవిలో విధులు నిర్వర్తించే సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. అటవీ శాఖ ఉద్యోగులు, సిబ్బంది విధి నిర్వహణలో తప్పనిసరిగా యూనిఫాం ధరించాలన్నారు. కార్యక్రమంలో జూనియర్ ఫారెస్ట్ అసోసియేషన్ కమిటీ సభ్యులు వైస్ ప్రెసిడెంట్ సయ్యద్‌పీరా, సెక్రటరీ ఎస్.జెడ్ తాహీర్ అహ్మద్, ఆర్గనైజర్ సెక్రటరీ కావేరి, జాయింట్ సెక్రటరీ తమ్మిశెట్టి కుమార్, ట్రెజరర్ ఆబిదా, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఎన్‌సీసీతో క్రమశిక్షణ
కర్నూలు (టౌన్): ఎన్‌సీసీ ద్వారా విద్యార్థుల్లో వ్యక్తిగత క్రమశిక్షణ, దేశభక్తి అలవడుతుందని ఎన్‌సీసీ కర్నూలు గ్రూపు కెప్టెన్ అరుణ్ అన్నారు. గురువారం స్థానిక సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలలో ఎన్‌సీసీ – ఏ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్‌సీసీ ద్వారా విద్యార్థులకు ఽధైర్య సాహసాలు అలవడుతాయని, ఎన్‌సీసీ వైపు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించాలన్నారు. ఈ సర్టిఫికెట్‌తో ఉద్యోగ, ఉపాధితో పాటు మెడికల్, ఇంజినీరింగ్ ట్రిపుల్ ఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాలయాల్లో అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎన్‌సీసీ అధికారులు దాసరి సుధీర్, ప్రతాప్ వినయ్, ఇన్‌స్పెక్టర్లు రవికుమార్, సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
యాజమాన్య పద్ధతులతో మామిడిలో అధిక దిగుబడులు
డోన్ టౌన్: మామిడి తోటల రైతులు యాజమాన్య పద్ధతులు పాటించి సస్య రక్షణ చేపడితే అధిక దిగుబడులు సాధించవచ్చునని యాగంటిపల్లె కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఆదినారాయణ, డోన్ ఉద్యానవనశాఖ అధికారిణి కళ్యాణి అన్నారు. గురువారం యు.కొత్తపల్లె గ్రామ రైతు సేవా కేంద్రంలో మామిడి తోట రైతులకు అవగాహన సదస్సును నిర్వహించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ సంవత్సరం అధిక వర్షాలు, తుపాన్ల కారణంగా బెట్ట ఆలస్యం అయ్యిందని, ఇప్పుడు వస్తు న్న పూతకు మొగ్గలు వచ్చిన వెంటనే నీరు అందించాలని సూచించారు. పూతకు రాని తోట ల్లో అర్క మ్యాంగో స్పెషల్‌ను 5 గ్రాములు ఒక లీటరు నీటిలో కలిపి వారం వ్యవధిలో రెండు, మూడు సార్లు పిచికారీ చేసుకోవాలన్నారు.
కవర్లు ఉపయోగించండి..
పిందె దశలో మామిడి పండ్లకు కవర్లు ఉపయోగించడం ద్వారా మంచి నాణ్యత కల్గిన పంట దిగుబడి సాధించవచ్చుని, ఇవి సబ్సిడీతో రైతులకు అందజేస్తున్నట్లు తెలిపారు. కవర్లతో పాటు పండ్లు మార్కెట్‌కు తరలించడానికి అవసరమయ్యే ట్రేలు కూడా సబ్సిడీపై లభిస్తాయన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
లారీ, కారు ఢీ
బండిఆత్మకూరు: పెద్ద దేవళాపురం గ్రామం వద్ద గురువారం రాత్రి ప్రమాదవశాత్తూ లారీ, కారు ఢీకొని పలువురికి స్వల్ప గాయ్యాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గోస్పాడు మండలం సాంబవరం గ్రామానికి చెందిన కొందరు ఆత్మకూరు సమీపంలోని దర్గాను దర్శించుకుని తిరిగి ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో పెద్ద దేవళాపురం గ్రామం వద్దకు రాగానే కారు డ్రైవర్ అజాగ్రతగా నడుపుతూ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేస్తామని తెలిపారు.
అటవీ సంరక్షణలో సిబ్బంది కీలకం
అటవీ సంరక్షణలో సిబ్బంది కీలకం
అటవీ సంరక్షణలో సిబ్బంది కీలకం


