భావితరాలకు మార్గదర్శకులు కావాలి
అపూర్వ మహసమ్మేళ నానికి హజరైన పూర్వ విద్యార్థులు
మాట్లాడుతున్న హైకోర్ట్ జడ్జి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి
ఎమ్మిగనూరుటౌన్: ‘‘ అందరూ ఆరు, ఏడు పదుల వయసు దాటిన వారే.. అందరికీ తెలియనిదంటూ ఏమీ లేదు.. భావితరాలకు మార్గదర్శకులు కావాలి’ అని తన తోటి మిత్రులు, సీనియర్లు అయిన పూర్వ విద్యార్థులకు హైకోర్ట్ జడ్జి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 1971–1974, 1972–1975 విద్యాసంవత్సరాలతో పాటు తరువాత చదివిన పూర్వ విద్యార్థుల అ‘పూర్వ’ మహా సమ్మేళనం ఎమ్మిగనూరు విశాల గార్డెన్‌లో శనివారం నిర్వహించారు. సుప్రీం కోర్ట్ న్యాయవాది బి.పురుషోతం రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాడు చదువులు చెప్పిన కళాశాల అధ్యాపకులైన బి.కేశవరెడ్డి, టీజీ.దత్త, పివి.రాజు, పి.నాగిరెడ్డిలను హైకోర్టు జడ్జితో పాటు పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు.
ఆనాటి హృదయాల ఆనందగీతం
అ‘పూర్వ’ మహా సమ్మేళనంలో దేశ, విదేశాల్లో స్థిరపడిన వారందరూ కలిసి భోజనాలు చేశారు. నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అప్పటి స్మృతులను ఒరరికొకరు చెప్పుకొంటూ సాయంకాలం వరకు సరదాగా గడిపారు. బాల్య మిత్రులను పేరుపెట్టి పలకరించారు. యాభై ఏళ్ల తర్వాత కలవడం ఆనందంగా ఉందన్నారు. ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ దైవాదీనంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
క్రమశిక్షణతో విద్య నేర్పిన గురువును ఎప్పటికీ ఎవరూ మరచిపోరు. తాను ఒకానొక కేసులో ఒక విద్యార్థిని హాస్టల్ వార్డెన్ కోచ్‌గా వ్యవహరించిన అంశంపై దాఖలు చేసిన కేసును వివరించాను. విద్యనేర్పిన వారు ఎవరైనా కావచ్చు ఆయన గురువే అని తీర్పు ఇచ్చాను. పుస్తక పఠనం ద్వారా తెలుసుకున్న విలువలతో కూడిన అంశాలను యువత, విద్యార్థులతో పంచుకొంటే అవి ఎంతో ఉపయోగపడతాయి.
– హైకోర్ట్ జడ్జి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి
గురువులు క్రమశిక్షణతో చదువులు చెప్పడంతో మేం ఉన్నత స్థాయికి చేరుకొన్నాం. కళాశాల చదువుల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. మిత్రుడు పురుషోత్తం రెడ్డితో కలిసి కళాశాల చదివే రోజుల్లోనే పలు వ్యాపారాలు చేశాను. ఇంట్లో పెద్దలు వారించడంతో చదువులపై దృష్టి సారించా. ఏడు పదుల వయసులో అందరు కలవడం ఎంతో సంతోషంగా ఉంది.
– రంగన్న, రిటైర్డ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్
ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 1973లో చదువుకున్నా. ఇన్నేళ్లకు కళాశాల స్నే హితులను, సీనియర్లను, జూనియర్లను చూసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నా. గతంలో అనంతపురంలో జిల్లా వినియోగదారుల ఫోరం సభ్యురాలిగాను న్యాయవాదిగా పని చేశా. ప్రస్తుతం సైక్రియాటిస్టుగా అమెరికాలో పని చేస్తున్నాను. అప్పటి స్నేహితులు సంధ్య, శశికళలు బెంగళూరు నుంచి వచ్చారు. – లలిత, అమెరికా
హైకోర్ట్ జడ్జి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి
ఎమ్మిగనూరులో గోల్డెన్ జూబ్లీ
మహాసమ్మేళనం
50 ఏళ్ల తర్వాత కలసిన
పూర్వ విద్యార్థులు
గురువులకు ఘన సన్మానం
భావితరాలకు మార్గదర్శకులు కావాలి
భావితరాలకు మార్గదర్శకులు కావాలి
భావితరాలకు మార్గదర్శకులు కావాలి
భావితరాలకు మార్గదర్శకులు కావాలి


