
కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ సత్యనారాయణరెడ్
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు లోని ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ ఎం. సత్యనారాయణరెడ్డి నియమితులయ్యా రు. ఆయన గత కొన్నేళ్లుగా ఆసుపత్రిలో ఆఫ్తమాలజి ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు సూపరింటెండెంట్‌గా కొనసాగిన డాక్టర్ పృథ్వీ వెంకటేశ్వర్లు ఉద్యోగ విరమణ చేయడంతో సత్యనారాయణరెడినియమించారు. 1998లో ఆయన కంటి ఆసుపత్రిలో మొబైల్ మెడికల్ ఆఫీసర్‌గా విధుల్లో చేరారు. 1999లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా,1997లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. 2022లో అనంతపురానికి బదిలీ అయ్యారు. మరుసటి సంవత్సరం ప్రొఫెసర్‌గా పదోన్నతి పొంది తిరిగి కర్నూలుకు బదిలీపై వచ్చారు.