
కర్నూలు(టౌన్): కర్నూలు నగరంలోని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఓ మైనర్ బాలుడిపై పోక్సో కేసు నమోదైంది. పోలీసుల వివరాల మేరకు.. పాతబస్తీకి చెందిన ఓ మైనర్ బాలుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. అదే వీధిలో 10వ తరగతి చదివే ఓ బాలికతో స్నేహం ఏర్పడి ప్రేమగా మారింది. చనువు పెరిగి ఇద్దరూ దగ్గరవడంతో ఆ బాలిక గర్భం దాల్చింది. గత నెల 20న బాలిక కడుపునొప్పితో బాధ పడుతుండటంతో తల్లి గ్రహించి ఆరా తీసింది.
విషయం తెలుసుకుని ట్యాబ్లెట్లు ఇచ్చింది. తీవ్ర నొప్పితో బాధ పడుతున్న ఆ బాలిక ఇంట్లోనే శిశువుకు జన్మనిచ్చింది. తల్లిదండ్రులు వెంటనే కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే శిశువు మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. మైనర్ బాలికను మోసం చేసి గర్భవతిని చేసిన మైనర్ బాలుడిపై బాధిత తండ్రి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.