
శమీ వృక్షానికి పూజ
కల్లూరు: దసరా పండుగను గురువారం ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లోని దుర్గామాతలకు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం శమీవృక్షం పూజలో పాల్గొన్నారు. కల్లూరు అర్బన్ కల్లూరు, వీకర్‌సెక్షన్ కాలనీ శమీవృక్ష పూజ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి పాల్గొన్నారు. దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జమ్మిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేశారు. శమీ వృక్షానికి, దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.