
ఆర్మీ జవాన్‌కు కన్నీటి వీడ్కోలు
పగిడ్యాల: ఆర్మీజవాన్ బడికెల తిక్కస్వామి(36)కి కన్నీటి వీడ్కోలు పలికారు. జమ్మూ కాశ్మీర్‌లో హవల్దార్‌గా విధులు నిర్వహిస్తూ అనారోగ్యానికి గురైన ఇతను ఢిల్లీ ఆర్‌ఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక బుధవారం మృతి చెందాడు. గురువారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో స్వగ్రామైన పగిడ్యాలకు మృతదేహాన్ని తీసుకొచ్చారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, కుటుంబసభ్యులు, బంధుమిత్రులు పూలమాలలు వేసి నివాళుర్పించిన అనంతరం మేజర్ రాహుల్‌దత్ నేతృత్వంలో జవాన్ అంతిమ యాత్ర కొత్త పాలమర్రి నుంచి శ్మశాన వాటిక వరకు శోకసంద్రంగా సాగింది. అక్కడ ఆర్మీజవాన్లు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు మృతుడి భార్య సుభాషిణికి గుర్తుగా ఆర్మీఅధికారులు జాతీయ జెండాను అందజేశారు. నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పుల్యాల నాగిరెడ్డి, తహసీల్దార్ శివరాముడు, ఇన్‌చార్జ్ ఎంపీడీఓ నాగేంద్రకుమార్, రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం, వివిధ కుల సంఘాల నాయకులు వీర జవాన్ తిక్కస్వామికి నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

ఆర్మీ జవాన్‌కు కన్నీటి వీడ్కోలు