
అనారోగ్యంతో ఆర్మీ జవాన్ మృతి
పగిడ్యాల: జ మ్మూ కశ్మీర్‌లో ఆర్మీ జవాన్‌గా విధులు నిర్వ హించే పగిడ్యాల వాసి శెట్టిమాన్ తిక్కస్వామి(35) వారం రోజులు గా అనారోగ్యం బారినపడి ఢిల్లీ ఆర్‌ఆర్ హస్పిటల్‌లో చికిత్స పొందుతూ కోలు కోలేక బుధవారం మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ఆర్మీలో 14 ఏళ్ల సర్వీస్‌ను పూర్తి చేసుకుని ఇటీవల మళ్లీ 8 ఏళ్ల సర్వీస్‌ను పొడిగించుకుని ఢిల్లీలో పరేడ్‌కు హాజరై బీపీ లెవెల్స్ పడిపోయి అనారోగ్యానికి గురయ్యాడని వెల్లడించారు. మృతునికి భార్య సుభాషిణి, కుమారులు నిక్షిత్, షణ్ముఖ్ ఉన్నారు. గురువారం స్వగ్రామం పగిడ్యాలలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.