
డ్రోన్ కెమెరాల నిఘాలో బన్ని ఉత్సవం
కర్నూలు: దసరాను పురస్కరించుకుని జిల్లాలో ప్రతిష్టాత్మకంగా జరిగే దేవరగట్టు మాళమల్లేశ్వర స్వామి బన్ని ఉత్సవాన్ని డ్రోన్ కెమెరాల నిఘాలో నిర్వహించనున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయుధ పూజ అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడారు. బన్ని ఉత్సవాల్లో 10 డ్రోన్ కెమెరాలతో పాటు 110 సీసీ కెమెరాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాల కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఉత్సవాల్లో ఎవరైనా గాయాలపాలైతే వెంటనే వైద్యం అందించేందుకు 20 బెడ్లతో తాత్కాలిక ఆసుపత్రితో పాటు 104, 108 అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఇప్పటికే దాదాపు 200 మంది ట్రబుల్ మాంగర్స్, సారా విక్రేతలను బైండోవర్ చేశామన్నారు. కార్డెన్ సెర్చ్‌లో భాగంగా 340 రింగుల కర్రలు, నాటుసారాను సీజ్ చేశామన్నారు. దేవరగట్టు పరిసర ప్రాంతాల్లో ఐదు చెక్‌పోస్టులు, పది పికెట్లు ఏర్పాటు చేశామన్నారు. ఉత్సవంలో చిన్నపిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలన్నారు. బన్ని ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా జరుపుకో వాలని భక్తులకు ఎస్పీ సూచించారు.
తెలుగుగంగలో
వ్యక్తి గల్లంతు
బండి ఆత్మకూరు: తెలుగు గంగ ప్రధాన కాలువలో బుధవారం ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. లింగాపురం గ్రామానికి చెందిన భూమా వెంకటేశ్వర రెడ్డి వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పొలం పనులకు వెళ్లిన అనంతరం తాగునీటి కోసమని ఓంకారం సమీపంలోని తెలుగుంగా ప్రధాన కాలువ వద్దకు వెళ్లాడు. మెట్ల వద్ద దాహం తీర్చుకునే ప్రయత్నంలో కాలుజారి ప్రవాహంలో గల్లంతయ్యాడు. స్థానికులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

డ్రోన్ కెమెరాల నిఘాలో బన్ని ఉత్సవం