
టమాట ధర మరింత పతనం
పత్తికొండ/ప్యాపిలి: మార్కెట్‌లో టమాట ధర మరింత పతనం అయ్యింది. గత కొద్ది రోజులుగా నిలకడగా ఉండటం లేదు. దీంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. గురువారం పత్తికొండ పట్టణంలోని మార్కెట్‌లో టమాట ధర కిలో రూ.2 నుంచి గరిష్టంగా రూ.4 మాత్రమే పలికింది. మార్కెట్‌లో ధర తగ్గినప్పుడు కూటమి ప్రభుత్వం కిలో 8 రూపాయలకు కోనుగోలు చేస్తామన్న హామీ ఇచ్చినా క్షేత్రస్థాయిలో అది అమలు కావడం లేదు. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పత్తికొండ మార్కెట్‌యార్డులో గురువారం టమాట 25కేజీల జత గంపలు కేవలం రూ.150 నుంచి రూ.250లోపు ధర పలికింది. వ్యాపారులు కమీషన్ పట్టుకోని ఇవ్వడంతో కేజీ రూ.2 నుంచి రూ. 4 మాత్రమే వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లో 421 క్వింటాల టమాటను వ్యాపారులు కోనుగోలు చేశారు. దాదాపు 10 లారీల సరకు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేశారు. మూడో రోజు కూడా పూర్తిగా ధరలు తగ్గిపోవడంతో ఈఏడాది టమాట పంట సాగు కోసం పెట్టిన పెట్టుబడులు కూడా రాక మమ్ముల్ని అప్పుల్లో ముంచేస్తుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఽ
ప్యాపిలిలో..
ప్యాపిలి మార్కెట్‌లో రెండు రోజుల క్రితం 25 కిలోల బాక్స్ రూ. 650 వరకు పలికింది. గురువారం మాత్రం 25 కిలోల బాక్స్ ధర రూ. 50 పలికింది. కిలో రెండు రూపాయలకు పలకడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారులు కుమ్మకై ్క రైతులను నిలువునా ముంచుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తనకేమీ పట్టనట్లు చోద్యం చూస్తోందని మండిపడ్డారు.